ఆ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ నమ్ముకున్నాడు

Share On

ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు లేదా తెలిసిన నగరాలలోనే ఎక్కడికైనా వెళ్లడానికి దారి తెలియనప్పుడు చాలా మంది గూగుల్ మ్యాప్ నమ్ముకుంటారు. కాని ఒక్కోసారి గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థమే కాక ఇబ్బందులో పడ్డవారు ఎంతోమంది ఉంటారు. అలాంటి సంఘటన ఒకటి జరిగింది. నావిగేషన్(ఫోన్ మ్యాప్స్)ను నమ్ముకున్న ఒక లారీ డ్రైవర్ దాని సూచనల ప్రకారం వాహనాన్ని నడిపి చివరకు.. ప్రమాద అంచుల వద్దకు వెళ్ళాడు. కొండలు పర్వతాల గుండా ప్రయాణించేటప్పుడు వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎత్తైన ప్రాంతాల్లో రహదారి సరిగా ఉండదు. దానికి తోడు భారీ మలుపులు ఉంటాయి. అందుకే కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు లారీ డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉంటారు. చైనాలోని చాంగీ ప్రాంతంలో ఒక భారీ లారీని నడుపుతున్న డ్రైవర్..రోడ్డు పై అవగాహన లేకపోవడంతో నావిగేషన్ ను అనుసరించి డ్రైవింగ్ చేస్తున్నాడు. బాగా ఎత్తైన పర్వతాల గుండా లారీ నడుపుతున్నాడు. ముందుకు వెళ్లేకొద్దీ రోడ్డు చాలా ఇరుకుగా తయారైంది.

దీంతో ముందుకు వెళ్లలేని లారీ డ్రైవర్..వాహనాన్ని వెనక్కు తిప్పుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. సన్నని ఘాట్ రోడ్డుపై లారీ తిప్పేందుకు వీలు లేకపోవడంతో లారీ రోడ్డు పక్కకు ఒరిగింది. దాదాపు 330 అడుగుల ఎత్తున ఉన్న కొండ అంచున లారీ వేలాడింది. లారీ డ్రైవర్.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా లారీతో సహా లోయలోకి పడిపోయే ప్రమాదం ఉంది. లారీలో ఉన్న మరో నలుగురు వ్యక్తుల ప్రాణాలకే ప్రమాదం ఉంది. ఇది గమనించిన మిగతా వాహనదారులు అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన అధికారులు లారీని క్షేమంగా బయటకు తీశారు. రోడ్డుపై అవగాహన లేకుండా కొండ ప్రాంతానికి వచ్చిన లారీ డ్రైవర్ ను అక్కడున్నవారు మందలించారు. అయితే ఇందులో తన తప్పిదం ఏమి లేదని.. కేవలం జీపీఎస్ నావిగేషన్ ను అనుసరించడంతో ఇలా జరిగిందంటూ బాధిత లారీ డ్రైవర్ అధికారులకు వివరించాడు. 


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu