80ఏళ్ల వృద్దురాలు చ‌నిపోయింది.. ఆవిడ మ‌ర‌ణం త‌ట్టుకోలేక‌

Share On

భార్య‌భ‌ర్త‌ల ప్రేమ మ‌ర‌ణం చివ‌రి వ‌ర‌కు ఉంటుంది.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఎన్నో గొడ‌వ‌లు వ‌చ్చినా కూడా స‌ర్దుకుంటూ జీవితాన్ని సాగిస్తారు.. కొడుకులు, కూతుళ్లు చేసుకొని దూరం వెళ్లిపోయాక కూడా ఆ భార్య‌భ‌ర్త‌లకు వృద్దాప్యం మీద ప‌డిన ఒక‌రినొక‌రు క‌లిసిమెలిసి ఉంటారు. ఆ వ‌య‌స్సులో ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేరు. వ‌ద్ధాప్య ద‌శ‌లో ఉన్న భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక ఆ భ‌ర్త కూడా త‌నువు చాలించిన విషాద సంఘ‌ట‌న న‌ల్గొండ జిల్లాలో జ‌రిగింది.

నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్‌దేవరపల్లిలో గ్రామానికి చెందిన ఎర్ర అంతిరెడ్డి(87) లక్ష్మమ్మ(80) భార్యాభర్తలు. వయసు మీద పడ్డా… పట్టణాల్లో స్థిరపడ్డ పిల్లల వద్దకు వెళ్లకుండా.. తమ ఊరిలోనే ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవనయానం సాగిస్తున్నారు. భార్య లక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవాజామున మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించిన అంతిరెడ్డి.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. తెల్లవారినా ఇద్దరూ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా అంతిరెడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. గంటల వ్యవధిలో భార్యాభర్తలు చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె ఉన్నారు. భార్య లేకుండా బ్రతకలేక ఆ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడడం గ్రామంలో విషాదాన్ని నింపింది. అంతిరెడ్డి-లక్ష్మమ్మను ఒకే చితిపై కుటుంబసభ్యులు దహనం చేశారు. ఈ విషయం తెలిసినవారు నిజమైన దాంపత్య బంధం అంటే ఇది కదా అని మాట్లాడుకుంటున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *