9నెల‌ల ప‌సిపాప‌తో త‌ల్లి రైల్వే లైన్‌ దాటుతుండ‌గా..

Share On

ఒక్కోసారి ఎవ‌రూ ఊహించ‌ని ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి.. అనుకోకుండా జ‌రిగే ప్ర‌మాదాల నుంచి కొంత‌మంది కోలుకుంటే, మ‌రికొంత‌మంది కోలుకోకుండా త‌యార‌వుతారు. అలాంటి ఒక సంఘ‌ట‌న‌
తల్లి, బిడ్డలు మృత్యువు అంచు వరకు వెళ్లి తప్పించుకున్నారు. ఈ ఘటనే తమిళనాడు లో చోటు చేసుకుంది.

రైల్వే లైన్లు దాటుతుండగా యువరాణి అనే మహిళ తన 9 నెలల పసి పాపతో రైలు పట్టాలు దాటేందుకు యత్నించింది. అనుకోకుండా ఆమె కాలు జారీ పట్టలాపై పడి పోయింది. అంతలో అదే ట్రాక్‌పై ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదకరంగా దగ్గరగా రావడం ఆమె గమనించింది. దీంతో షాక్ తిన్న ఆమె కదలలేకపోయింది. అయితే ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి యువరాణి, తన పాపతో కలిసి తెలివిగా పట్టాల మధ్యలో అలానే ఉండిపోయింది. వారిని రక్షించడానికి ట్రాక్ పై వాళ్ళు పడి ఉన్నది చూసిన రైల్వే సిబ్బంది ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ను సకాలంలో ఆపి వారిని రక్షించారు. ఈ ఘటనలో పాప క్షేమంగా బయటపడింది కానీ యువరాణి తలకు గాయాలయ్యాయి. రైల్వే అధికారులు, ప్రయాణికులు ఆమెను ట్రాక్‌పై నుంచి లేపి సురక్షిత ప్రాంతానికి తరలించారు.యువరాణి, ఆమె బిడ్డను చికిత్స నిమిత్తం వేలూరు ఆసుపత్రికి తరలించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *