క‌రెంట్ తీగ‌ల‌పై కూర్చునే ప‌క్షుల‌కు షాక్ ఎందుకు కొట్ట‌దంటే..

Share On

క‌రెంట్ తీగ చూస్తే స‌న్న‌గా ఉంటుంది.. కాని దాన్ని ప‌ట్టుకుంటే మాత్రం ప్రాణం పోతుంది.. ఇంట్లో క‌రెంట్ రిపేరు చేసేట‌ప్పుడు చిన్న‌గా వైరు తగిలిన జ‌ల్లు అంటుంది.. అలాంటిది త‌ర‌చూ కరెంటు వైర్ల మీద కాకులు, పిట్టలు కూర్చుంటాయి.. మ‌రీ వాటికి షాక్ కొట్టదా అనే ప్ర‌శ్న అందరిలో ఉంటుంది.. అస‌లు వాటికి క‌రెంట్ షాక్ కొడుతుందా, లేదా అనేది తెలుసుకుందాం..

క‌రెంట్ తీగ‌ల‌పై కూర్చోనే ప‌క్షుల‌కు షాక్ కొట్ట‌క‌పోవ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయి. సాధారణంగా మన ఇంటికి వచ్చే కరెంట్ తీగలు 4 ఉంటాయి. అందులో 3 తీగల్ని ఫేజులు అని, ఒకదాన్ని న్యూట్రల్‌ అనీ అంటారు. ఒక ఫేజు తీగకు, మరో ఫేజు తీగకు మధ్య, ఒక ఫేజు తీగకు, న్యూట్రల్‌ తీగకు మధ్య విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటుంది. ఒక వ్యక్తిలోగానీ, వస్తువులో కానీ, జంతువులోగానీ విద్యుత్‌ ప్రవహించాలంటే దానికి అటూ ఇటూ విద్యుత్‌ పొటెన్షియల్‌ తేడా ఉండాలి. అంటే ఒక వ్యక్తికి షాక్‌ కొట్టాలంటే ఏకకాలంలో కనీసం రెండు తీగలతో అనుసంధానం ఉండాలి. అప్పుడు అధిక పొటెన్షియల్‌ ఉన్న తీగలోకి, అల్ప పొటెన్షియల్‌ ఉన్న తీగ నుంచి ఎలక్ట్రాన్లు ఆ వ్యక్తి ద్వారా ప్రయాణిస్తాయి.

ఇలా ఎలక్ట్రాన్లు శరీరంలో ప్రవహిస్తేనే ప్రమాదం. మనుషులు కూడా కేవలం ఒకే తీగను పట్టుకుని వేలాడితే ఏమీ కాదు. నేలను చెప్పుల్లేకుండా తాకితేనో, లేదా రెండు వైర్లను ఏకకాలంలో తగిలితేనో ప్రమాదం. పక్షుల విషయానికి వస్తే అవి ఒకే సమయంలో 2 తీగలపై వాలవు. కాబట్టి వాటి దేహం ద్వారా విద్యుత్‌ ప్రవహించదు. పొరపాటున అది అటొక కాలు, ఇటొక కాలు ఒకేసారి పెడితే షాకుకి గురవుతుంది. ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *