నిజాయితీపరులకు యూత్ ఫర్ యాంటీకరప్షన్ అండగా ఉండాలి

Share On

సమాజంలో నీతి, నిజాయితీపరులకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అండగా ఉండాలని సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. ఒక నిర్దిష్ట లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే కాస్త ఆలస్యమైనా మంచి సమాజం కోసం మార్పు సాధ్యమవుతుందన్నారు. గత పది సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వినూత్న కార్యక్రమాలతో ముందుకుపోతుందన్నారు. అవినీతిని ప్రశ్నించడమే కాకుండా నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్న వారికి ఈ సంస్థ ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. నిజాయితి పరుల సంఖ్య పెరుగుతున్న కొద్ది మంచి సమాజం ఏర్పడుతుందని ఆ దిశగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ కృషిచేయాలన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి, వైఏసీ బృందం కొమటి రమేష్ బాబు, జి. జయరాం, కానుగంటి రాజు, చెరుకూరి జంగయ్య, కొన్నె దేవేందర్, ముడావత్ రమేష్ నాయక్, మణిదీప్, ప్రవీణ్, సారా, హరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *