ఆ గుహ‌లో ఉన్న‌వారికి చావు లేదంట‌..

Share On

ఈ భూమి మీద ఎన్నో వింత‌లు, విశేషాలు ఉన్నాయి.. పురాత‌న కాలంలో ఎవ‌రికి తెలియ‌న ర‌హ‌స్యాలు అనేకం ఉన్నాయి.. హిమాల‌యాల‌లో ఇప్ప‌టికి ఎవ్వ‌రికి అంతుబ‌ట్ట‌ని సాధువులు, మునులు ఉన్నారు. భూమిపై ఉన్న కోట్లాది గుహ‌ల‌లో ఒక గుహ మాత్రం చాలా ప్ర‌త్యేక‌మ‌ని చెపుతున్నారు. ఆ గుహ‌లో ఉండేవారికి మ‌ర‌ణం రాద‌ని చెపుతున్నారు. ఆ గుహ గురించి కాస్త తెలుసుకుందాం..

హిమాల‌యాల్లో గ్యాన్ గంజ్ అనే చిన్న‌ గుహ ఉంది. ఇక్కడ ఉన్నవారికి చావు లేదని చెబుతారు. అక్క‌డ ఉన్న‌ వారంతా మరణం జయించినవారని స్థానికులు చెబుతారు. అయితే ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి అందరికీ సాధ్యం కాదని చెబుతారు. కేవలం సిద్ధపురుషులకు మాత్రమే ఈ గుహను చేరుకోవడానికి వీలవుతుంది. ఈ గుహలో సమయాన్ని నిలుపుదల చేసే ఒక‌ గొప్ప వ్యక్తి ఉన్నారని చెబుతారు. దీంతో ఈ గుహను చేరుకున్నవారి వయస్సు పెరగకుండా అలా ఆగిపోతుందని చెబుతారు. అందువల్లే ఇక్కడ ఉన్నవారికి చావు అన్నది లేదని చెబుతారు. హిమాలయ పర్వత పక్తుల్లో అదృశ్య‌ రూపంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని సిద్ధాశ్రమ అని కూడా అంటారు.

వాల్మీకి రామాయణం, మహాభారతంలో కూడా ఈ గ్యాన్ గంజ్ ఆశ్రమం ప్రస్తావన ఉంది. ఎవరు ఈ స్థలాన్ని చేరుకోవడానికి అర్హులో వారికే ఈ గుహ కనిపిస్తుందని చెబుతారు. మిగిలిన వారు ఈ గుహ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం శూన్యమని తెలుస్తోంది. ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ఇప్పటి ఆధునిక కాలం వరకూ ఈ గ్యాన్ గంజ్ ఒక రహస్య స్థలం మాత్రమే. ఇది ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో కూడా ఈ రహస్య ప్రాంతాన్ని కనుగొనడానికి వీలు కాలేదు. సిద్ధయోగులు మాత్రమే ఈ స్థలంలోకి ప్రవేశించడానికి వీలవుతుంది.

ఈ ఆశ్రమం మన సాధారణ ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అన్నిరకాల సౌలభ్యాలు ఉంటాయని చెబుతారు. కొన్ని కొండ గుర్తులను అనుసరించి టిబెట్ వెస్ట్ రీజన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉంది. ఆశ్రామనికి చెందిన గ్యాన్ ఆనంద్ పరమహంస క్రీస్తుశకం 1225లో కనిపించారని సమాచారం. ఈ ప్రాంతం గురించిన పరిశోధన కేవలం భారత దేశంలోనే కాకుండా టిబెట్ లో కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ ఎంతో మంది ఈ ఆశ్రమం కోసం పరిశోధలను చేస్తూనే ఉన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu