
కొంతమంది యువకులు కలిసి ముంబైలో కొన్ని నెలలుగా చెత్త దందాకు తెరలేపడంతో ఆ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ చెత్త దందా గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ముంబైలో తొలిసారిగా ఈ ‘గే సెక్స్ రాకెట్’ వెలుగుచూసింది. ఆన్లైన్ గే డేటింగ్ యాప్ ‘Grindr’ ద్వారా ఈ గ్యాంగ్ కొన్ని నెలలుగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ‘గే’ సెక్స్ కోసం ఫిట్‌గా ఉన్న అబ్బాయిలు కావాలని ఈ గ్యాంగ్‌ను కాంటాక్ట్ అయిన చాలామంది సమాజంలో పేరూపలుకుబడి ఉన్నవాళ్లు ఉన్నారు. ముంబైలోని మాల్వాని ప్రాంతం కేంద్రంగా ఈ గ్యాంగ్ ఈ ‘గే సెక్స్ రాకెట్’ను నడుపుతోంది. ఈ గ్యాంగ్ సభ్యులను ముంబైకి చెందిన ముగ్గురు యువకులు ఫర్ఖాన్ ఖాన్ (26), అహ్మద్ ఫరూక్ షేక్ (24), ఇమ్రాన్ షఫిక్ షేక్ (24) గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యులు పరారీలో ఉన్నారు.
పోలీసుల విచారణలో ఈ గ్యాంగ్ గురించి తేలిందేంటంటే ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా ‘గే’ సెక్స్ కోరుకునే వ్యక్తులతో పరిచయం పెంచుకుని.. వారికి ‘గే’ సెక్స్‌కు సిద్ధంగా ఉన్న యువకులు తమ దగ్గర ఉన్నారని చెప్పి అవతలి వ్యక్తుల నుంచి డబ్బులు దండుకోవడం ఈ గ్యాంగ్ పని. అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఒక యువకుడు ‘గే’ డేటింగ్ యాప్ ద్వారా ఈ ముఠాను సంప్రదించాడు. గంటకు వెయ్యి రూపాయలు అవుతుందని అతనికి ఈ యువకులు చెప్పారు. అంతా ఓకే అనుకున్న తర్వాత తమ ప్లేస్‌కు రమ్మని సదరు అకౌంటెంట్‌కు కబురు పంపారు. ఆ యువకుడు అక్కడికి వెళ్లి గదిలోకి వెళ్లగానే నలుగురు యువకులు అతనిని కొట్టి అతని ఫోన్ లాక్కున్నారు. పర్స్, మెడలో చైన్ కూడా లాగేసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఏటీఎం పిన్ చెప్పాలని అతనిని బెదిరించారు. అతనిని బెదిరించి నగ్నంగా చేసి.. అతనితో అంగచూషణ చేయించుకుంటూ అభ్యంతరకర వీడియో ఒకటి తీశారు. ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియో మీ అమ్మానాన్నకు చూపిస్తామని ఆ యువకుడిని బెదిరించారు.
వాళ్ల దగ్గర నుంచి బయటపడేందుకు డబ్బు తీసుకొచ్చి ఇస్తానని ఆ యువకుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు. జరిగిందంతా కుటుంబ సభ్యులకు చెప్పుకుని భోరుమన్నాడు. ఆ యువకుడు ఎంతసేపటికీ రాకపోవడంతో నిందితులు డబ్బు కోసం అతని ఇంటి బయట నిల్చుని చూస్తూ ఉన్నారు. వాళ్లను చూసిన సదరు యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వస్తుండటాన్ని చూసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధిత యువకుడు ఈ ఘటనపై కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. ఈ ‘గే’ సెక్స్ రాకెట్ గ్యాంగ్ గురించి విషయం బయటకు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లో ప్రధానంగా ఈ ముగ్గురు యువకులే కీలక పాత్ర పోషించినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈ యువకులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.