
భారతీయ రైల్వేశాఖ సుదూర ప్రయాణం చేసే ప్రయాణీకులకు అనుకోకుండా ఆనారోగ్య సమస్యలు ఏర్పడినపుడు చికిత్స అందించేందుకు ఏలాంటి సౌకర్యాలు కల్పించారు. రైల్వే జంక్షన్లలో కనీసం ప్రథమ చికిత్స అందించే ఏర్పాట్లు ఉన్నాయా.. ఉంటే వారు అందుబాటులో ఉన్నారని ప్రయాణీకులకు ఏలా చెపుతున్నారు. లేకుంటే ఎందుకు నియమించలేదు..24గంటలకు పైగా సుదూర ప్రయాణం చేసే రైల్వేలో కనీసం ప్రథమ చికిత్స అందించే వైద్య సిబ్బందిని నియమించారా.. నియమిస్తే ప్రతి బోగిలో వారు సమాచారం ఎందుకు లేదు.. పై సమాచారం స్పష్టంగా తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి కేంద్ర రైల్వేశాఖకు సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగిందని తెలిపారు