ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది

Share On

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై యూత్ ఫర్ యాంటీకరప్షన్ సహకారంతో ముందడుగు పౌండేషన్ ఐదు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించడం జరిగింతని సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ముందడుగు పౌండేషన్ ఐదు రాష్ట్రాల్లో చేసిన సర్వే ఫలితాలను సోమవారం హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. 

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కాషాయంపంజాబ్ లో ఆప్, కాంగ్రెస్ హోరాహోరీగోవా, మణిపూర్ సైతం బిజెపికే ఆశలు

సర్వే పూర్తి వివరాలను రాజేంద్ర పల్నాటి విడుదల చేస్తూ తాము సర్వే చేసిన ప్రాంతాల వివరాలను బట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ప్రకటించారు. 

తమ సంస్థ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలను సర్వే చేసిందని మా సర్వే ప్రకారం 

ఉత్తరాఖండ్‌ 2022మొత్తం స్థానాలు 70
బీజేపీ 32-35కాంగ్రెస్‌ 24-31ఆప్ 0-4ఇతరులు 0-5 

ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం స్థానాలు 403
బీజేపీ+                    221ఎస్పీ+                      150బీఎస్పీ+                    13కాంగ్రెస్                    02ఇతరులు                07

గోవాలో మొత్తం స్థానాలు 40
బీజేపీ 15-18కాంగ్రెస్+ 14-16ఆప్ 03-07టీఎంసీ+ 03-05ఇతరులు 00-05

మణిపూర్‌ మొత్తం స్థానాలు 60
బీజేపీ 26- 30కాంగ్రెస్ 12-18ఎన్పీఎఫ్‌ 03-08ఎన్పీపీ 07-11ఇతరులు 04-06

పంజాబ్ ఎన్నికల్లో మొత్తం స్థానాలు – 117
ఆప్‌ 56-70కాంగ్రెస్‌ 39- 51అకాలీదళ్‌ 07-11బీజేపీ 01-04ఇతరులు 00-02

ముందడుగు పౌండేషన్ నుంచి ఐదు అసెంబ్లీ రాష్ట్రాలలో పలు నియోజకవర్గాల్లో ప్రజలను ముఖాముఖీ కలుసుకొని గత ప్రభుత్వ పనితీరు, ఇప్పుడు ఏలాంటి ఓటు వేయబోతున్నారు అనే పలు అంశాలపై ప్రజలతో సర్వే చేశామని పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. మొదటిసారిగా తాము జాతీయస్థాయిలో చేసిన సర్వేను విడుదల చేస్తున్నామని ఇకపై ప్రతి ఎన్నికల్లో, ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యపై, నాయకుల పనితీరుపై కూడా ముందడుగు పౌండేషన్ నుంచి సర్వే చేస్తామని వారు తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu