మ‌ళ్లీ ప్రారంభ‌మైన వైఎస్ ష‌ర్మిళ పాద‌యాత్ర‌..

Share On

ప్ర‌జ‌ల కోసమే నేనంటా, ప్ర‌జ‌ల కోసమే నేను ఉన్నానంటూ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లి ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తూ, వారి స‌మ‌స్య‌ల‌ను వింటూ ముందుకు కొన‌సాగుతున్నారు వైఎస్ ష‌ర్మిళ‌. వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల తిరిగి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. గతేడాది అక్టోబర్ 20వ తేదీన ఈ పాదయాత్ర ప్రారంభం కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కొవిడ్ ఉధృతి కార‌ణంగా తాత్కాలికంగా వాయిదా ప‌డింది. 21రోజుల పాటు 247 కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ రోజు వాయిదా ప‌డిన చోటు నుంచే పాదయాత్ర‌ను తిరిగి మొద‌లుపెట్టారు. లోట‌స్ పాండ్ లోని పార్టీ కార్యాల‌యం నుంచి పార్టీ శ్రేణులతో క‌లిసి భారీ కాన్వాయ్ తో కొండ‌పాక‌గూడెం గ్రామానికి బ‌య‌లుదేరారు. సాయంత్రం 3.30 గంట‌ల‌కు పాద‌యాత్ర పునఃప్రారంభించారు. ష‌ర్మిల‌క్క వెంట పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీగా క‌దిలారు. కొండ‌పాకగ నుంచి చిన్ననారాయ‌ణ‌పురం, నార్కెట్ ప‌ల్లి, మడ ఎడవెల్లి మీదుగా సాగింది. సాయంత్రం పోతినేనిపల్లి క్రాస్ కు చేరుకున్నారు. 22వ రోజు పాద‌యాత్ర 10.4 కిలోమీట‌ర్ల మేర సాగింది. నార్కెట్‌ప‌ల్లిలో నిర్వ‌హించిన భారీ స‌మావేశంలో వైయ‌స్ ష‌ర్మిలతో పాటు విజ‌య‌మ్మ కూడా హాజ‌రై ప్ర‌సంగించారు. వైయ‌స్ఆర్ గారిని త‌లుచుకుని విజ‌య‌మ్మ కంట‌త‌డి పెట్టారు.

వైఎస్ విజ‌య‌మ్మ మాట్లాడుతూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌రితాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చిదిద్ది, రూ.1.85ల‌క్ష‌ల కోట్ల‌తో 86 ప్రాజెక్టులు నిర్మించి, బీడు భూముల‌ను స‌స్య‌శ్యామ‌లం చేశారన్నారు. ప్ర‌జ‌లే త‌మ దేవుళ్లంటూ అహ‌ర్నిశ‌లు వారికోసం ఆలోచించిన గొప్ప మ‌నిషి రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని ఆయ‌న ఆశ‌యాల‌నే నేర‌వేర్చేందుకే ష‌ర్మిల‌మ్మ నేడు మీ కోసం న‌డుస్తుందన్నారు.. రేపు మీ అంద‌రినీ న‌డిపిస్తుంది. ప్ర‌తి ఒక్క‌రూ ష‌ర్మిల‌మ్మ‌ను ఆశీర్వ‌దించాలి. బంగారు తెలంగాణ రూప‌క‌ల్ప‌న ష‌ర్మిల‌మ్మ‌తోనే సాధ్యమ‌ని తెలిపారు.

వైఎస్ షర్మిళ మాట్లాడుతూ వైయ‌స్ఆర్ గారు చ‌నిపోతే 700 మంది గుండెలు ఆగిపోయాయి. దీనిబ‌ట్టి వైయ‌స్ఆర్ గారు ఎంత‌గొప్ప నాయ‌కుడో తెలుసుకోవ‌చ్చ‌ని, వైయ‌స్ఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు 33 సార్లు న‌ల్ల‌గొండ జిల్లాకు వ‌చ్చారు. మ‌రి కేసీఆర్ గారు ఎన్నిసార్లు వ‌చ్చారో చెప్పాల‌న్నారు. కెసిఆర్ కేవ‌లం ఉప ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే, ప్ర‌చారం చేయ‌డానికి వ‌స్తున్నాడు త‌ప్ప ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఏనాడూ రాలేదన్నారు. పేద ద‌ళితుల‌కు డబుల్ బెడ్ రూం ఇల్లు అని మోసం చేశాడు. ద‌ళితుల‌కు మూడెక‌రాలు ఇస్తామ‌ని మోసం చేశాడు. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ద‌ళితుల‌పై దాడులు 800శాతం పెరిగాయి. ద‌ళితులంటే కేసీఆర్ కు చిన్న‌చూపు. ద‌ళిత జ‌నాభా 19శాతానికి పెరిగింద‌ని, అందుకే రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ చెబుతున్నారు. మ‌రి కేసీఆర్ కేబినెట్‌లో ఎంత‌మంది ద‌ళితుల‌కు చోటు ఇచ్చారని వారు ప్ర‌శ్నించారు. ఏడేళ్లుగా కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట‌గా సాగింది. ప్ర‌తిప‌క్షాలు ఏరోజు ప్ర‌శ్నించ‌లేదు. ఇక్క‌డి ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారు. ప్ర‌జ‌ల కోసం ప్రశ్నించే గొంతుక లేదు, ప్ర‌జ‌ల కోసం పోరాడే వాళ్లు లేరు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద పోరాటం చేయ‌డానికే వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న తిరిగి తీసుకురావ‌డ‌మే మా పార్టీ ల‌క్ష్యం. ప్ర‌జా వ్య‌తిరేక కేసీఆర్ నియంత పాల‌న పోవాలి. కేసీఆర్ అవినీతి అక్ర‌మ పాల‌న పోవాలి. ఆత్మ‌హ‌త్య‌లు ఆగాలి, అభివృద్ధి జ‌ర‌గాలి. వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న తిరిగి రావాలి. అందుకే వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేయ‌డమే మా పాద‌యాత్ర‌ని ష‌ర్మిళ అన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu