
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఎక్కువగా రైల్వేను ఎంచుకుంటారు.. రోజుల తరబడి రైల్వేలో ప్రయాణం చేస్తారు.. రిజర్వేషన్లో కూర్చున్నా, జనరల్ బోగీలో ఉన్న ఎవరికైనా అత్యవసర ఆనారోగ్య సమస్య ఏర్పడితే ఎవరికి చెప్పాలి.. ఎవరూ పట్టించుకుంటారు అనేది మాత్రం ఎవ్వరి దగ్గర సమాధానం లేదు.. రైల్వేలో సుదూర దూరం ప్రయాణించే ప్రయాణీకులకు అనుకోకుండా ఆనారోగ్యానికి గురైతే రైల్వే శాఖ ఏలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది.. ప్రయాణీకులకు ఏలా చేరవేస్తుందో అని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి సమాచార హక్కు చట్టం కింద కేంద్ర రైల్వేశాఖను ప్రశ్నించగా వారి ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.
రైల్వే ప్రయాణీకులకు ఆనారోగ్య సమస్య వస్తే ఏలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అంటోంది. భారత సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుసరించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఏర్పాటైన నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం, ప్రాణాలను రక్షించే మందులు, పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్ మొదలైన వాటితో కూడిన మెడికల్ బాక్స్‌ను అందించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అన్ని రైల్వే స్టేషన్లు మరియు ప్రయాణీకుల రవాణా రైళ్లు. ఫ్రంట్ లైన్ సిబ్బంది అంటే రైలు టికెట్ ఎగ్జామినర్, రైలు సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మొదలైనవారు ప్రథమ చికిత్స అందించడంలో శిక్షణ పొందుతారు. అటువంటి సిబ్బంది కోసం రెగ్యులర్ రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తారు. రైల్వే స్టేషన్ల సమీపంలోని ఆసుపత్రులు మరియు వైద్యుల జాబితా, వారి ఫోన్ నంబర్లు అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. రైల్వేలు, గవర్నమెంట్, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ల అంబులెన్స్ సేవలు గాయపడిన, అనారోగ్య ప్రయాణికులను ఆసుపత్రులు, డాక్టర్ క్లినిక్‌లకు తరలించడానికి ఉపయోగించబడతాయి. వాటితో పాటు అదనంగా బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు, రైల్వేయేతర వైద్య వృత్తిపరమైన సమూహాలచే నిర్వహించబడే ముంబైలోని 24 సబ్-అర్బన్ స్టేషన్లలో క్లినిక్‌లు స్థాపించబడ్డాయి. దేశంలోని ఇతర 29 రైల్వే స్టేషన్లలో కూడా ఇటువంటి క్లినిక్‌లు స్థాపించబడ్డాయని వారు తెలిపిన సమాచారంలో ఉంది.. కాని రైల్వే ప్రయాణీకులకు మాత్రం ఆ సమాచారం చేరవేసే చర్యలు చేపట్టడం లేదు..
ప్రయాణీకులకు తెలియజేసే బాధ్యత ఎవరిది..
రైల్వేలో ప్రయాణించే ప్రయాణీకులకు వైద్య సౌకర్యాలపై తెలియజేసే ప్రయత్నం మాత్రం కేంద్ర రైల్వేశాఖ తెలియజేయట్లేదు. కనీసం టికెట్ బుక్ చేసుకునే వారి వారి ప్రాంతీయ బాషలలో కాంటాక్ట్ నంబర్ ముద్రించాలని ఆలోచన కూడా చేయలేదు. రైలు ప్రయాణం చేసే పేద ప్రజలకు ఏలా తెలియాలి. అసలు సుదూర ప్రయాణం రైల్వేలో చేసే వారికి వైద్య సదుపాయాలు వాస్తవానికి అందుబాటులో లేవు అనేది అక్షర సత్యం. ప్రయాణ సమయంలో అత్యవసర ఆరోగ్య సమస్యలు వస్తే.. దానికి తగిన డాక్టర్ సదుపాయం దగ్గర లేదు. ఈ క్లినిక్‌లు అత్యవసర ప్రయాణీకులను అందించడమే కాకుండా ఏ రోగికైనా సకాలంలో సేవలు అందించవచ్చు. దీనిపైన కేంద్ర రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు.