భార‌త ఆర్మీలో ఒక మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం..

Share On

ఒక మ‌హిళ‌కు భారత ఆర్మీలో అరుదైన గౌర‌వం ల‌భించింది. దేశంలోనే త్రీ స్టార్ ర్యాంక్ పొందిన మూడవ మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. ధార్వాడ్‌లో జన్మించిన డాక్టర్ మాధురి కనిత్కర్ కు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌గా పదోన్నతి లభించింది. 37 ఏళ్లుగా ఆర్మీలో సేవలందిస్తున్న డాక్టర్ మాధురి కనిత్కర్..లెఫ్టినెంట్ జనరల్ పునితా అరోరా, ఎయిర్ మార్షల్ పద్మ బందోపాధ్యాయ తరువాత ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. గతంలో పూణేలోని ఆర్మీ మెడికల్ కళాశాల డీన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మెడికల్‌కు చీఫ్‌గా ఉన్నారు. త్రీ స్టార్స్ పొందిన మూడవ మహిళగా..భర్తతో పాటు సమానంగా త్రీ స్టార్ పొందిన తొలి మహిళగా డాక్ట‌ర్ మాధురి ఖ్యాతి గడించారు. ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్లో ఈమె ఏకైక డాక్టర్‌గా కూడా ఉన్నారు.

మ‌నిషి త‌న క‌ల‌ల‌ను సాకారం చేసుకోవడంలో జెండర్ అనేది ఎప్పుడూ అడ్డంకి కాలేదంటున్నారు డాక్టర్ మాధురి కనిత్కర్. తన తల్లిదండ్రులు, టీచర్లు కూడా అలా ఎప్పుడూ భావించలేదన్నారు. ఏదీ అసాద్యం కాదని తనకు తన ఇద్దరు చెల్లెల్లకు తల్లిదండ్రులు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. గొప్ప ఆలోచ‌న‌లు, ఆశ‌యాల‌తో త‌మ జీవితాన్ని ముందుకు న‌డిపించుకున్న‌ప్పుడే అనుకున్న విజ‌యాలు సొంత‌మ‌వుతాయ‌న్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu