
దేశంలోని రోజురోజుకు డ్రగ్స్ మాఫియా పెరిగిపోతుంది. డ్రగ్స్ నివారణకోసం కేంద్ర ప్రభుత్వం 2010 సంవత్సరం నుంచి 2021 వరకు ఎంత ఖర్చు చేశారు. ప్రజల్లో ఏలాంటి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎంతమందిని డ్రగ్స్ నిందితులను అరెస్ట్ చేశారు.. అందులో ఎంతమందికి శిక్ష పడింది.. ఎంత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఏం చేశారు, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపండని కేంద్ర ప్రభుత్వానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసింది.