సైబర్ క్రైం అవగాహనకు 700కోట్లకు పైగా ఖర్చు..

Share On

టెక్నాలజీ పెరుగుతోంది.. కాస్త పరిజ్ఞానం తెలిసిన వారి ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. ప్రపంచమే ఇప్పుడు అరచేతిలో కనబడుతోంది.. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారని ఇదే అదనుగా భావించి సైబర్ కేటుగాళ్లు బీభత్సంగా రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతులు వాడుతూ మొబైల్ వాడుతున్న ప్రతి వారిని మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతోమంది డబ్బులు పోగోట్టుకోవడమే కాకుండా కొంతమంది సైబర్ నేరగాళ్ల అగడాలకు తట్టుకోకుండా ప్రాణాలు కొల్పోయిన వారు ఉన్నారు. అసలు సైబర్ నేరగాళ్ల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని, గత పది సంవత్సరాల నుంచి ఎంత ఖర్చు చేశారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించగా పలు వివరాలను వెల్లడించింది..

దేశంలో సైబర్ కేసుల నిర్మూలనకు, సైబర్ కేటుగాళ్ల నివారణకు గత పది సంవత్సరాల నుంచి ఎంత ఖర్చు చేశారని కేంద్రాన్ని ప్రశ్నించగా కేంద్ర మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ యాదవ్ పలు విషయాలు లేఖ ద్వారా పంపించారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైబర్ నేరాలు నివారణ కోసం.. తనకి ప్రజలకు అవగాహన కల్పించడానికి.. రేడియో పరంగా, సామాజిక మాధ్యమాలు అనగా ట్విట్టర్లో అయితే @ సైబర్ దోస్త్.. అనే హష్ టాగ్ ద్వారా గా కూడా అవగాహన కల్పించారు. సైబర్ సేఫ్టీ మరియు రక్షణ సంబంధించిన వారాల వారీగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు.., దేశంలోని అన్ని రాష్ట్రాలతో కలిసి C-DAC వారి అసోసియేషన్ తో కలిసి కండక్ట్ చేశారు. అందులో భాగంగా దేశం మొత్తం సైబర్ నేరాలపై అవగాహన కోసం వంద కోట్ల మెసేజ్ లను కూడా పంపించడం జరిగిందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని సైబర్ సేఫ్టీ రక్షణ విభాగం, ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సెమినార్స్, కాన్ఫరెన్స్ లు, వర్క్ షాపులు మొదలగునవి కూడా నిర్వహించినట్లు తెలిపారు.

ఇప్పటివరకు సైబర్ నేరాల నిర్మూలనకోసం మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం 728 కోట్ల 78 లక్షలు మంజూరయ్యాయి. (భాగస్వాములు :- C-DAC, AICTE, Delhi police, BPR&D, NCRB, My Gov., and prasar bharathi, beauro outreach and communication (boc)). దేశంలో ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి, డెహ్రాడూన్, రాయపూర్ ఇలా అనేక ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu