గుడికి వెళ్లిన‌ప్పుడు ప్ర‌సాదం ఏలా తీసుకోవాలో తెలుసా..

Share On

భ‌గ‌వంతుడు చ‌ల్ల‌గా చూడాల‌ని, ఏలాంటి ఇబ్బ‌దులకు ఎదుర‌వ్వ‌కూడద‌ని, స‌మ‌స్య‌లు వ‌స్తే వెంట‌నే తొల‌గిపోవాల‌ని కొరుకుంటూ ఎవ‌రికి న‌చ్చిన ఆల‌యానికి వారు వెళుతుంటారు.. ప్ర‌తి ఆల‌యంలో ఏదో ఒక ప్ర‌సాదం పెడుతుంటారు.. దేవుడు ప్ర‌సాదాన్ని ఏలా తినాలో ఇప్ప‌టికి చాలా మందికి తెలియ‌దు.. దాని గురించి తెలుసుకుందాం..

శివాల‌యం వెళ్లిన‌ప్పుడు బిల్వ తీర్థం ఇస్తే, వెంకటేశ్వ‌ర‌స్వామి గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు.
కొంతమంది స్వయంగా చేతిలో తీసుకుంటే మ‌రికొంత‌మంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి ఒంపుకుంటారు .అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి. తీర్థం తీసుకోవాలి అంటే ఎడమచేతి పైన కుడిచేతిని పెట్టి తీర్థం తీసుకుని రెండు కళ్ళకు మొక్కుకుని ఆ తరువాత తాగాలి. తీర్థం తాగేసాక ఆ అరచేతిని తలపైన తుడుచుకుంటారు. కాని తీర్థాన్ని త‌ల‌పైనే తుడుచుకోవ‌ద్దు. రెండు చేతుల‌తో తుడుచుకోవాలి. స్త్రీలు తీర్థ ప్ర‌సాదం గుడిలో తీసుకునేప్పుడు వారి పైట కొంగును చేతులతో పట్టుకోవాలి. పూలు అయితే పైటకొంగులోనే తీసుకోవాలి.

కొన్ని దేవాల‌యాల‌లో చక్కర పొంగలి లాంటివి ఇచ్చినప్పుడు కుడిచేత్తో తీసుకుని అలాగే నోట్లో వేసేసుకుంటుంటారు. పక్షులకు చేతులు లేవు కనుక అవి అలా తింటాయి మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు. కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకుని ఎడమచేతిలోకి మార్చుకుని కుడిచేత్తో కొద్దికొద్దిగా తీసుకుని తినాలి. అలా కాకుండా కుడిచేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో తీసుకుంటే మరుజన్మలో పక్షులై పుడతారని చెబుతారు. మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని మన పెద్దలు చెపుతారు, అదీ శాస్త్రంలో కూడా ఉంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu