
మనిషి ఆలోచన ఒక్కొసారి రాక్షసజాతి కన్నా హీనంగా తయారవుతోంది.. ఒక్క క్షణంలో మనిషి ప్రవర్తన ఏలా మారిపోతుందో అర్థం కావడం లేదు.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా… ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా అవకాశం దొరుకుతే చాలు లైంగిక వేధింపులకు పాల్పడడం మామూలై పోయింది. ఎవరైన ఏకాంతంగా దొరికితే వారిపై అఘాయత్యాలకు పాల్పడుతూ వారి శరీరంలోని ప్రైవేటు భాగాలను తాకుతూ.. పైశాచీకానందం పొందుతున్నారు. ఈ కోవకు చెందిన ఒక కేసుపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ముంబైలో గత సంవత్సరం ఒక బాలుడు ఆన్ లైన్ గేమ్ రిచార్జీ కోసం నగర శివారులోని దుకాణానికి వెళ్లాడు. అక్కడ దుకాణ యజమాని బాలుడి పట్ల అసహజంగా ప్రవర్తించాడు. అతని పెదవులపై ముద్దులు పెట్టుకుంటూ, ప్రైవేటు భాగాలను చేతితో తడిమి పైశాచీకానందం పొందాడు. బాలుడు భయపడిపోయి ఇంటికి వచ్చేశాడు. జరిగిన దారుణాన్ని తన తండ్రికి తెలిపాడు. దీంతో వారు సమీపంలోని పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి తరపు న్యాయవాది.. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అనూజా ప్రభుదేసాయి నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. నిందితుడు లైంగిక దాడి చేసినట్లు ఎలాంటి మెడికల్ టెస్ట్ లలో రుజువు కాలేదని అన్నారు. బాలుడిని ముద్దు పెట్టడం అసహజ నేరంకాదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులు అరెస్టు అయిన వారికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. ప్రస్తుతం మాత్రం నిందితుడికి తాత్కలిక బెయిల్ మంజురు చేస్తు కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది..