
చార్ ధామ్ యాత్ర సంధర్బంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం బార్కొట్ నుంచి యమునోత్రి వెళ్లే ఘాట్ రోడ్డుకు ఎన్ని నిధులు మంజూరయ్యాయి.. ఎంత ఖర్చు చేశారు. వాటి వివరాలు తెలపండి.. అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో కనీసం రోడ్డు పక్కన పెన్సింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఒకవేళ జరగని ప్రమాదం జరుగుతే అందుకు బాధ్యులెవరు. కేంద్రప్రభుత్వం దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఆదేశాలు జారీ చేయడం లేదో తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసింది.