
రవిప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి ఆరోగ్యం, సంతోషం కలుగుతాయి. ప్రదోష ముహూర్తంలో ఈ రోజున శివుడిని (Lord shiva) పూజించే సంప్రదాయం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో భోళాశంకరుడు చాలా సంతోషంగా ఉంటాడు. కాశీ జ్యోతిష్యుడు చక్రపాణి భట్ ప్రకారం జ్యేష్ఠ శుక్ల త్రయోదశి తిథి జూన్ 12వ తేదీ తెల్లవారుజామున 03:23 గంటలకు ప్రారంభమై జూన్ 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:26 గంటలకు ముగుస్తుంది. రవిప్రదోష వ్రతం జూన్ 12న రానుంది. ఉపవాసం ఉండే వారు రవి ప్రదోష వ్రత కథ చదవాలి లేదా వినాలి. ఈ కథ గురించి తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారు చాలా పేదవాడు. బ్రాహ్మణుడి భార్య ప్రదోష వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించేది. ఒకరోజు వాళ్ల కొడుకు గంగాస్నానానికి ఊరి నుండి బయటకు వెళ్తుండగా దారిలో కొందరు దొంగలు అతనిని చుట్టుముడతారు. ఆ దొంగలు అతని విడుదల చేయాలంటే తన తండ్రి రహస్య సంపద గురించి చెప్పాలని షరతు పెడతారు. తన కుటుంబం చాలా పేదదని, వారి వద్ద డబ్బు లేదని బ్రాహ్మణ కుమారుడు చెబుతాడు. అప్పుడు ఆ దొంగలు అతడిని విడిచి పారిపోతారు .
అప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు నగరంలోని ఒక మర్రిచెట్టు కింద నిద్రపోతాడు. ఈ సమయంలో రాజు సైనికులు, దొంగల కోసం వెతుకుతూ, ఆ మర్రి చెట్టు కిందకు చేరుకుంటారు. అతడిని దొంగగా పట్టుకుని జైల్లో పెడతారు. సూర్యాస్తమయం తర్వాత కూడా బ్రాహ్మణ కుమారుడు ఇంటికి చేరుకోకపోవడంతో అతని తల్లి ఆందోళనకు చెందుతుంది. ఆ రోజు ప్రదోష వ్రతం. తన కుమారునికి రక్షణ కల్పించమని ఆ శివయ్యను ప్రార్థిస్తుంది. శివుడు కరుణించాడు. ఆ రాత్రి రాజుకు కలలో కనిపించి, ఆ బ్రాహ్మణ కుమారుడిని వదిలేయండి, అతడు దొంగ కాదు అని చెప్పాడు. మీరు అతన్ని జైలు నుండి విడుదల చేయకపోతే, మీ రాజ్యం పూర్తిగా నాశనం అవుతుందని చెబుతాడు.
తెల్లవారుజామున రాజు సైనికులను బ్రాహ్మణ కుమారుడిని విడిచిపెట్టమని ఆదేశించాడు. బాలుడు రాజు ఆస్థానానికి హాజరై, జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. రాజు తన తల్లిదండ్రులను దర్బారుకు పిలిపిస్తాడు. భయంతో రాజు ఆస్థానానికి చేరుకున్నారు. మీ కొడుకు నిర్దోషి, పొరపాటున బందీ అయ్యాడని రాజు వారితో చెప్పాడు. రాజు తన తప్పును సరిదిద్దుకుంటూ, ఆ బ్రాహ్మణ కుటుంబానికి జీవనోపాధి కోసం 5 గ్రామాలను దానం చేశాడు. శివుని అనుగ్రహం వల్ల ఆ బ్రాహ్మణ కుటుంబం సుఖసంతోషాలతో జీవించడం మొదలుపెడుతుంది.