పెళ్లిళ్ల‌కు అత‌ను వ‌స్తున్నాడంటే భ‌యం.. ఎవ‌రూ పిల‌వ‌రు కూడా..

Share On

ఊబ‌కాయం అనేది ఈ రోజుల్లో పెరుగుతున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.. రోడ్డు మీద ఏది క‌న‌బ‌డితే అది తిన‌డం మామూలైపోయింది.. శ‌రీరానికి క‌ష్టంమాట తెలియ‌కుండా, సుఖ‌మే ఎక్కువైపోయింది. కొంత‌మంది ఎంత ప్ర‌య‌త్నించినా వారి బ‌రువు మాత్రం త‌గ్గ‌రు. ఐతే ఒక భారీకాయుడు ఏకంగా 200 కిలోల‌ల‌కుపైనే బ‌రువు ఉన్నాడు. ఆయ‌న‌కు న‌డ‌వ‌డం కూడా చాలా క‌ష్టంగా మారింది. ప్ర‌తి రోజు అత‌ను 15కిలోల ఆహారం తింటాడు. అందుకే అత‌నికి భ‌య‌ప‌డి బంధువులు కూడా పెళ్లిళ్ల‌కు, పంక్ష‌న్ల‌కు పిల‌వ‌డమే మానేశారంట‌.

బీహార్​(Bihar) రాష్ట్రంలోని కటిహార్ జిల్లా జయనగర్​కు చెందిన రఫీక్​ అద్నాన్(30)​ పుట్టినప్పటి నుంచి అత‌ను అధిక ఆహారం(Food) తీసుకునేవాడు. ఇప్పుడు అతని బరువు 200 కిలోలకుపైనే ఉంది. ఆ బ‌రువే ఇప్పుడు ఇప్పుడు అతడికి పెద్ద సమస్యగా మారింది. ఎటూ కదల్లేక ఎన్నో కష్టాలు పడుతున్నాడు. సాధారణ బైక్‌లు అతని బరువు మొయ్యలేవు కాబట్టి బుల్లెట్‌నే వాడుతుంటాడు. అది కూడా అప్పుడప్పుడు రఫీక్‌ను మోయలేక ఇబ్బంది పెడుతుంటుంది. రఫీక్ అద్నాన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి పేరు బులిమియా నెర్వోసా.. పరిమితులు లేకుండా ఆహారం తీసుకోవడం అనేది ఈ వ్యాధి లక్షణం. దీంతో రఫీక్ ప్రతిరోజూ 3 కిలోల బియ్యం, 4 కిలోల గోధుమ పిండితో చేసిన రోటీలు, 2 కిలోల మాంసం, 1.5 కిలోల చేపలు తింటాడు. వాటితో పాటు రోజులో మూడుసార్లు ఒక లీటరు పాలు తాగుతాడు. మొత్తం మీద రఫీక్ రోజుకు 14-15 కిలోల ఆహారాన్ని తీసుకుంటాడు. రఫీక్ ప్రస్తుత బరువు 200 కిలోలు. పుట్టినప్పటి నుంచి రఫీక్ అధిక ఆహారం తీసుకునేవాడు. రఫీక్‌కు సరిపడే వంట చేయడం ఒక మనిషికి సాధ్యం కాదు. అందుకే అతను రెండు వివాహాలు చేసుకున్నాడు. భార్యలిద్దరూ కలిసి రఫీక్‌కు సరిపడే వంట చేసి పెడుతుంటారు. ఊబకాయం కారణంగా రఫీక్‌కు సంతానం కలగలేదు. రఫీక్ తీసుకునే ఆహారం గురించి తెలిసి బంధువులు, స్నేహితులు అతడిని శుభకార్యాలకు పిలవడానికి కూడా భయపడుతుంటారు. రఫీక్ తన గ్రామంలో సంపన్న రైతు. అందువల్ల అతనికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ లేదు.

రఫీక్‌కు చికిత్స అందించే డాక్టర్ మృణాల్ రంజన్ మాట్లాడుతూ.. రఫీక్‌కు బులిమియా నెర్వోసా అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా తింటుంటారు. ఈ వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. లేదంటే రోగి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. చాలా నెమ్మదిగా అతను తీసుకునే ఆహారం పరిమాణం తగ్గించుకుంటూ రావాలని చెప్పారు. మెరుగైన చికిత్స, వైద్యుల పర్యవేక్షణ, సరైన ఆహార ప్రణాళికతో దీనిని నయం చేయవచ్చని తెలిపారు. బులీమియా నెర్వోసా వ్యాధి ఎక్కువగా జన్యుపరంగా వస్తుంది. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా కలుగుతుంది. దీని కారణంగా వ్యక్తి ప్రవర్తన మారుతుంది. భయాందోళనలకు గురవుతాడు. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని వైద్యులు చెబుతున్నారు. చుట్టుపక్కల అలాంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే.. డాక్టర్లకు చూపించాలని సూచిస్తున్నారు. డైటీషియన్​, సైకియాట్రిస్ట్​ సహా కౌన్సిలింగ్​ కూడా అవసరమని చెబుతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu