యూట్యూబ్ వీడియోలు చూసి గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారాడు..

Share On

అప్పుల పాల‌య్యాడు.. అప్పులు ఏలా తీర్చాలో అర్థం కాలేదు.. త‌న స్నేహితుడికి బాధ అంతా చెప్పుకున్నాడు.. స్నేహితుడు ఇచ్చిన స‌ల‌హా పాటించి చివ‌రికి జైలు పాల‌య్యాడు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కూచివారిపల్లికి చెందిన చక్రపాణి అనే అతను అందినకాడల్లా రూ.లక్షల్లో అప్పులు చేశాడు. భార్య, పిల్లలున్న చక్రపాణికి ఈ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాలేదు. ఈ క్రమంలోనే తండ్రితో గొడవపడి పుట్లూరు మండలం రంగనాయనపల్లిలోని అత్తగారింటికి చేరుకున్నాడు. ఈ సమయంలోనే తన స్నేహితుడు సాయితేజ గుర్తుకురావడంతో.. అతనికి తన బాధలన్నీ చెప్పాడు. దాంతో దీనికి ఒక్కటే మార్గం ఉందన్న సాయితేజ.. చక్రపాణికి ఒక ఐడియా ఇచ్చాడు, అలా చేస్తేనే అప్పులు తీరతాయని చెప్పడంతో చక్రపాణి కూడా గుడ్డిగా ఫాలో అయ్యాడు.

ఇంతకీ స్నేహితుడు సాయితేజ ఇచ్చిన ఐడియా ఏంటంటే.. యూట్యూబ్‌ (YouTube) లో వీడియోలు చూసి గ్యాంగ్‌స్టర్‌గా మారి, బెదిరించి డబ్బులు సంపాదిచొచ్చని. ఇద్దరూ కలిసి ఆ వీడియోలు అన్నీ చూసి డబ్బులు ఎక్కువగా డాక్టర్ల దగ్గర ఉంటాయని డిసైడ్ అయ్యి.. స్థానిక మాధురి వైద్యశాల వైద్యుడిని బెదిరించి రూ.20 లక్షలు వసూలు చేయాలని పథకం రచించారు. అందులో భాగంగానే ‘రూ.20 లక్షలు ఇవ్వాలని లేకుంటే నిన్ను, నీ కుటుంబ సభ్యులను కాల్చి చంపుతాము. బెంగళూరు హైవే దగ్గరకు డబ్బులు తీసుకురావాలని లెటర్‌‌లో రాసి బైక్‌లో పెట్టుకుని డాక్టర్ ఇంటి దగ్గర పడేయడానికి వెళ్తున్నాడు.

సరిగ్గా ఈ సమయంలోనే.. బుక్కరాయసముద్రం చెరువుకట్టపై పోలీసులు సాధారణ తనిఖీల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇది చూసిన చక్రపాణి వారిని చూసి బైక్ వదిలేసి పారిపోయాడు. దాంతో పోలీసులు అతన్ని పట్టుకుని, బైక్‌ను పరిశీలించగా.. ఈ లెటర్లు దొరకడంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన స్టయిల్‌లో విచారించగా అసలు విషయం కక్కేశాడు. తన స్నేహితుడి సలహాతోనే ఇలా చేశానని అంగీకరించాడు. దాంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో యూట్యూబ్ చూసి దొంగనోట్లు, బాంబులు తయారు చేసిన ప్రబుద్ధులు పోలీసులకు చిక్కారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu