ఆ గ్రామాల‌లో యువ‌కుల‌కు గ‌డ్డం ఉంటే పెళ్లికి అనుమ‌తి లేదు..

Share On

ఒక్కొ గ్రామాల‌లో ఒక్కొ వింత ప‌ద్ద‌తులు ఉంటాయి.. అలాంటిది రాజస్థాన్‌లోని ఒక సంఘం పెళ్లికొడుకులకి విచిత్రమైన నిబంధనలు పెట్టింది. ఆ నియమాల ప్రకారం వరుడికి గడ్డం ఉంటే పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదు. పాలి జిల్లాలోని 19 గ్రామాల్లో ఈ నిబంధనను విధించారు. కుమావత్ సంఘం ఆమోదించిన తీర్మానం ప్రకారం పెళ్లిలో అబ్బాయి గడ్డం పూర్తిగా నిషేధం. పెళ్లి అనేది ఒక‌ సంప్రదాయబద్ధమైన కార్యక్రమం కాబట్టి.. ఫ్యాషన్‌కు తావు ఉండకూడదని ఆ సంఘం అభిప్రాయపడింది.

“ఫ్యాషన్ బాగానే ఉంది. కానీ పెళ్లి అనేది ఒక మతకర్మ కాబట్టి వరుడికి ఫ్యాషన్ పేరుతో గడ్డాలు అనుమతించం. వరుడిని రాజుగా చూస్తారు. కాబట్టి అతను క్లీన్ షేవ్ చేయాలి” అని కుమావత్ సంఘం తీర్మానంలో పేర్కొంది. అంతేకాదు వివాహాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఖర్చులను తగ్గించాలని కూడా ఈ సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా బండోలి డీజే డ్యాన్స్‌లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిపై పూర్తి నిషేధం విధించింది. వివాహ వేడుకల్లో నల్లమందు, హల్దీ వేడుకలో పసుపును వాడకుండా నియమాలు పెట్టింది.

అలాగే ఈ సంఘం పెళ్లికూతురు ధరించే బంగారం, వెండి నగలపై నిబంధనలు పెట్టారు. ఆ రూల్స్‌ను అనుసరించి మాత్రమే బంగారం, వెండి ఆభరణాలు వేసుకోవాలి. ఇక వేడుకల్లో అతిథుల కోసం ఏర్పాటు చేసే ఆహార పదార్థాల సంఖ్యను పరిమితం చేయాలని సంఘం తీర్మానించింది. ఆ తీర్మానంపై అందరూ ఆమోదం కూడా తెలిపారు. ఈ సందర్భంగా “ఈ రోజుల్లో వివాహాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే సమాజంలోని మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలపై భారంగా మారడంతో వాటిని మా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా సాదాసీదాగా నిర్ణయించుకున్నాం” అని ఆ సంఘానికి చెందిన లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే తన సొసైటీలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 20 వేల మంది సభ్యులు ఉన్నారని, ప్రతి ఒక్కరూ సమావేశ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu