ఇంటర్ బోర్డులో రికార్డులు తనిఖీ చేసిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్

Share On

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కార్పోరేట్ కళాశాలలు శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలో 2017, 2018, 2019, 2020, 2021 సంవత్సరాలలో ఏఏ గ్రూపులలో ఎంతమంది విద్యార్థులు ఆడ్మిషన్ తీసుకున్నారు. అందులో ఎంతమంది పాస్ అయ్యారు. ఎంతమంది ఫెయిలయ్యారు. వారి పూర్తి వివరాలను అందించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా ఇంటర్ మీడియట్ బోర్డును ప్రశ్నించడం జరిగిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తును స్వీకరించిన ఇంటర్ మీడియట్ పిఐఓ మీరు కోరిన సమాచారం తెలుసుకోవడానికి ఇంటర్ మీడియట్ బోర్డు కార్యాలయానికి వచ్చి రికార్డులు తనిఖీలు చేసుకోవాలని సమాచారం ఇచ్చారు. ఈ నెల 17, 18, 20 తేదీలలో ఇంటర్ బోర్డుకు కార్యాలయానికి రావాలని కోరారు. ఇంటర్ బోర్డు పిఐఓ సమాచారం మేరకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం ఇంటర్ బోర్డు కార్యాలయానికి వెళ్లి గత సంవత్సరాలలో ఎంతమంది విద్యార్థులు శ్రీచైతన్య, నారాయణ కళాశాలలో జాయిన్ అయ్యారు, ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఐదు సంవత్సరాల సమాచారం అడిగామని సమయభావం వలన కొన్ని సంవత్సరాల సమాచారం సేకరించామని, మిగతా సమాచారం తనిఖీ కొరకు మరిన్ని రోజులు సమయం అడిగామన్నారు. తనిఖీ చేసిన పూర్తి సమాచారాన్ని నోట్ చేసుకున్నామని రాజేంద్ర తెలిపారు. గత సంవత్సరాలలో ఎంతమంది శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలలో వివిధ గ్రూపుల కింద ఆడ్మిషన్ తీసుకున్నారు. ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు. ఎంతమంది ఫెయిలయ్యారో, మిగతా సమాచారాన్ని తనిఖీ చేసిన తర్వాత పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. ఇంటర్ బోర్డులో శ్రీచైతన్య, నారాయణ కళాశాలల రికార్డులు తనిఖీ చేసిన వారిలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్టీఐ ప్రత్యేక బృందం కొన్నె దేవేందర్, మణిదీప్, కొమటి రమేశ్ బాబు, బత్తిని రాజేష్, కోట శ్యాం కుమార్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu