
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్లకు సంబంధించిన ప్రధాన సూత్రధారిని పోలీసులు గుర్తించారు. కామారెడ్డి వాసి మధుసూదన్‌ను పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వాట్సప్ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ అల్లర్లకు సంబంధించి 56 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు వారిలో 46 మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 10 మందిని అరెస్టు చేయాల్సి ఉందని రిపోర్టులో వెల్లడించారు. పలు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు యువకులను రెచ్చగొట్టినట్లు దర్యాప్తులో తేలిందని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు.