దారుణం.. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చెయ్యలేదని..

Share On

 రోజురోజుకు సమాజం ఏలా తయారవుతుందో అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకే దారుణాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేయలేదనే కారణంతో ఒక యువకుడు.. 16 ఏళ్ల బాలికను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లినీ గాయపర్చినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
స్థానికంగా నివసించే రవి అనే యువకుడు.. పెళ్లి కార్డు ఇచ్చేందుకు ఆదివారం రాత్రి ఇక్కడి నాగ్లా బోహ్రా గ్రామంలోని బాలిక ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే కార్డు తీసుకునేందుకు బాలిక ముందుకు రాగా.. ఒక్కసారిగా అతను కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానిక ఎస్పీ మార్తాండ్‌ ప్రకాశ్‌ సింగ్‌ తెలిపారు. కుమార్తెను కాపాడేందుకు యత్నించిన తల్లిపైనా దాడికి పాల్పడినట్లు ఎస్పీ చెప్పారు. అనంతరం కత్తితో పొడుచుకుని తానూ ఆత్మహత్యకు యత్నించాడని వెల్లడించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కౌశల్ తెలిపారు. ఫేస్‌బుక్‌లో తన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయలేదనే అక్కసుతోనే నిందితుడు తన కుమార్తెను హత్య చేశాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయపడిన తల్లి, నిందితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu