పెళ్లై రెండేళ్లు.. ఇప్పటికి తన భర్త తనను తాకలేదు..

Share On

తనకు పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది.. కాని ఇప్పటికి తన భర్తతో కలయిక జరగలేదని, తన భర్తలో ఏదో లోపం ఉంది తనకు విడాకులు కావాలంటూ ఒక మహిళ కోర్టు మెట్లెక్కింది. ఇండోర్‌కు చెందిన మహిళ.. 32 ఏళ్ల దిలేశ్వర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ రెండేళ్ల పాటు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇప్పటివరకు మొదటిరాత్రి జరగలేదు.
ఫస్ట్ నైట్ నుంచి ఆమె భర్త వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెను ఒక్కసారి కూడా తాకలేదట. కొద్దిరోజులు వేచి చూసిన ఆమె.. స్వయంగా తానే ప్రయత్నించింది. అప్పటికీ ఆమె భర్తలో చలనం రాలేదట. దగ్గరకి వచ్చిన ప్రతీసారి అతడు వేరే గదిలోకి వెళ్లి పడుకునేవాడట. ఇదొక్కటే కాదు.. ఆడవారిలా మేకప్ వేసుకోవడం, లిప్‌స్టిక్, ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకునేవాడట. అతడికి ఇలా ప్రవర్తించవద్దని చెప్పి చూడగా.. వినడం మాట అటుంచితే.. ఆమెను పట్టుకుని కొట్టేవాడట. దీనితో విసుగు చెందిన సదరు యువతి.. తనకు విడాకులు ఇవ్వాలంటూ కోర్టుకెక్కింది. కాగా, ఈ కేసును విచారించిన కోర్టు.. తనదైన శైలిలో తీర్పునిచ్చింది. భార్యకు విడాకులు మంజూరు చేయడమే కాకుండా.. ప్రతీ నెలా రూ. 30 వేలు పరిహారంగా చెల్లించాలని భర్త దిలేశ్వర్‌‌కు ఆదేశాలు ఇచ్చింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu