అప్ఘానిస్తాన్ వ‌ణికించిన భారీ భూకంపం..

Share On

బుధ‌వారం తెల్ల‌వారు జామున భారీ భూకంపం అప్ఘానిస్తాన్ దేశాన్ని వ‌ణికించింది.. ఈ భూకంప ప్ర‌మాదంలో 255మందికి పైగా మ‌ర‌ణించారు. ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 6.1 తీవ్రతతో భూమి కంపించిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. 51 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని ప్రకటించింది. భూకంపం ధాటికి పక్టికా ప్రావిన్స్‌లో వంద మంది మృతిచెందారని, 250 మంది గాయపడ్డారని తాలిబన్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ హెడ్‌ మహమ్మద్‌ నసీమ్‌ హఖ్ఖానీ తెలిపారు. ఖోస్ట్‌, నంగార్హర్‌ ప్రావిన్సుల్లో కూడా పెద్ద సంఖ్యలో మరణించారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్నారు.

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, లాహోర్‌, ముల్తాన్‌, ఖ్వెట్టాలో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున 2.24 గంటల సమయంలో భూమి కంపించిందని తెలిపింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu