
మంచి ఆలోచనతో, మంచి సమాజం కోసం, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సమాచారహక్కు చట్టం పుస్తకాన్ని తీసుకురావడం మంచి పరిణామమని చంచల్ గూడ జైలు సూపరిండెంటెంట్ శివకుమార్ గౌడ్ అన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలపై ఏ విధంగా ప్రశ్నించాలి, శాంతియుతంగా ఏలా పరిష్కరించాలనే వారికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందన్నారు. సామాన్యుడికి అవసరమయ్యే చట్టం సమాచారహక్కు చట్టమని ప్రతి ఒక్కరూ దానిని మంచి సమాజం కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం సమాచారహక్కు చట్టం అవగాహన కోసం ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సమాచారహక్కు చట్టం అందుబాటులో లేదని, ప్రతి సామాన్యుడు తమ సమస్యను ప్రశ్నించే విధంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్టీఐ బుక్ ఉండపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మణిదీప్, కోట శ్యాంకుమార్, రమేష్ బాబు, బి. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.