
అఖిల భారత సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి.. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ మెయిన్స్‌కు మొత్తం 13,090 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.