కొత్త‌గా ఉండాల‌ని.. ఊరేగింపు బుల్డోజ‌ర్ మీద చేశాడు..

Share On

పెళ్లి అంటేనే నానా హంగామా ఉంటుంది.. కాని ఇప్పుడు ఒక్కొక్క‌రు ఒక్కొ విధంగా ప్లాన్ చేస్తున్నారు.. సాదాసీదాగా చేసుకునే విధానం కంటే జీవితంలో ఎప్ప‌టికి గుర్తుండిపోవాల‌ని ఆలోచిస్తూ వినూత్నంగా ఆలోచించే వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటిది ఉత్తరప్రదేశ్‌లో ఒక వరుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. సాధారణంగా పెళ్లి కొడుకు గుర్రంపైనో.. కారులోనో ఊరేగిపుంగా వధువు ఇంటికి చేరుకుంటాడు. కానీ ఉత్తరప్రదేశ్‌లో బహ్రైచ్ జిల్లా లక్ష్మణ్‌పూర్ నుంచి వరుడు బాద్షా బుల్డోజర్‌పై బరాత్‌గా పెళ్లికూతురు ఇంటికి వెళ్లాడు.

పెళ్లి అంటే ఆట, పాట, బరాత్ ఇవన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండా సాదాసీదాగా చేసుకునే వివాహం చేసుకున్నవాళ్లు చాలా తక్కువ. కొంతమంది తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలని.. ఇంకొంచెం వెరైటీగా చేసుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక వరుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. సాధారణంగా పెళ్లి కొడుకు గుర్రంపైనో.. కారులోనో ఊరేగిపుంగా వధువు ఇంటికి చేరుకుంటాడు. కానీ ఉత్తరప్రదేశ్‌లో బహ్రైచ్ జిల్లా లక్ష్మణ్‌పూర్ నుంచి వరుడు బాద్షా బుల్డోజర్‌పై బరాత్‌గా పెళ్లికూతురు ఇంటికి వెళ్లాడు.

బుల్డోజర్‌పై వచ్చిన వరుడు “బుల్డోజర్ బాబాకి జై” అంటూ నినాదాలు కూడా చేశాడు. దాంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. అలాగే పెళ్లికొడుకు బుల్డోజర్‌‌పై వచ్చినందుకు గ్రామ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాకుండా.. అందంగా అలకరించిన ఆ బుల్డోజర్‌తో గ్రామ ప్రజలు సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై పెళ్లి కొడుకు స్పందించాడు. “నేను నా పెళ్లిని మరపురాని ఈవెంట్‌గా మార్చాలనుకున్నాను. ఈ ఆలోచన కూడా భిన్నంగా ఉంటుందని నేను అనుకున్నానని బాద్షా చెప్పాడు. మొత్తానికి బుల్డోజర్‌ ట్రెండ్ పెళ్లిళ్లకు కూడా పాకింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu