
ఆడపిల్లల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కొంతమంది కామాంధుల్లో కనీస మార్పు రావడం లేదు. ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో సంచలన కేసు వెలుగు చూసింది. బలోద్ జిల్లాలో మైనర్ బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఒక యువకుడు ఆమెను కిడ్నాప్ చేసి.. లద్దాఖ్‌లోని లేహ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఒక ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాదాపు 8 నెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇన్ని నెలల తర్వాత ఎట్టకేలకు ఆ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బలోద్ జిల్లా దౌండిలోహరా పోలీస్‌లో అక్టోబర్ 1, 2021న ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదయింది. తమ అమ్మాయి కనిపించడం లేదని.. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని.. ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అదృశ్యమైన మైనర్ ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఐతే ఆమె స్విచాఫ్ కావడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఎక్కడికి వెళ్లిందో తెలియదు? ఎవరు తీసుకెళ్లారో తెలియదు? ఐనా కేసును చేధించాలని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ కంకణం కట్టుకున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. ఆమె కోసం గాలించారు.
ఐతే ఈ క్రమంలో బుల్లుటోలాకు చెందిన తిలకరం మాణిక్పురిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సైబర్‌సెల్ సాయంతో లొకేషన్న పోలీసులు ట్రేస్ చేశారు. చివరకు తిలక్‌రామ్ కేంద్రపాలిత ప్రాంతం లేహ్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత దౌండిలోహరా పోలీస్ స్టేషన్ బృందం లద్దాఖ్‌కు వెళ్లింది. లొకేషన్ ఆధారంగా అతడు ఎక్కడున్నాడో పోలీసులు తెలుసుకున్నారు. తిలక్రామ్ను అరెస్ట్ చేసి..ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లారు. అనంతరం బాలికను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. తనపై 8 నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. కూతురి బాధను చూసి తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులపై కిడ్నాప్‌తో పాటు అత్యాచారం కింద నేరం నమోదు చేశారు. యువకుడు తిలక్ రామ్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌పై జైలుకు పంపారు.