
మనదేశంలో ఒక ఆచారం ఉంది.. పిల్లలు పుట్టిన ఆరు నెలలు లేదా తొమ్మిది నెలలకు చాలా మంది వారి దగ్గరలో ఉన్న ప్రధాన దేవాలయాలకు వెళ్లి పుట్టు వెంట్రుకలు తీస్తారు.. వారి నమ్ముకున్న దేవుడిని కొలుస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.. ఆ చిన్నారి మేనమామ మొదట కొంత జుట్టును కత్తిరిస్తారు. అనంతరం వారికి పూర్తిగా గుండు చేయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, శ్రీశైలం, యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాల్లో చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు. మరి చిన్నారులకు గుండు కొట్టించడం వెనుక మరొక సైన్సు దాగి ఉంది.. అదేటంటే
చాలా మంది హిందువులు దేవుడి సమక్షంలో పిల్లలకు గుండు చేయిస్తుంటారు. ఇలా చేస్తే తమ బిడ్డ భవిష్యత్ బాగుటుందని.. విశ్వసిస్తారు. దేవుడి ఆశీర్వాదం తమ చిన్నారిపై ఉంటుందని నమ్ముతారు.
తల్లి కడుపులో తొమ్మిది నెలల పాటు ఉన్న బిడ్డ ఈ లోకానికి వచ్చాక.. వారి తలపై చాలా సూక్ష్మక్రిములు ఉంటాయి. తల వెంట్రుకలను ఎంత శుభ్రం చేసినా వాటిని తొలగించలేం. షాంపూతో తలంటు స్నానం చేయించినా సూక్ష్మక్రిములు వెళ్లిపోవు. అందుకే పిల్లలకు గుండు చేయిస్తారు. ఇది తలపై ఉన్న సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాను పూర్తి స్థాయిలో తొలగిస్తుంది.
పిల్లల్లో శిరోముండనం చేస్తే.. వారి శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రణలో ఉంటుంది. పిల్లలకు గుండు చేయిస్తే.. కురుపులు, మొటిమలు, విరేచనాలు వంటి వ్యాధులు దూరమవుతాయి. తల కూడా చల్లబడుతుంది. గుండు చేసినప్పుడు.. పిల్లల తలపై ఉన్న వెంట్రుకలన్నింటినీ తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా అతని తల భాగంలోని చర్మంపై పడుతుంది. ఈ సూర్యరశ్మి మంచి మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిరల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చిన్నపిల్లలకు గుండు చేయించడం వల్ల పిల్లలకు దంతాలు సులువుగా వస్తాయని శాస్త్రీయ నమ్మకం కూడా ఉంది. అందుకే హిందువుల ఆచారాల ప్రకారం.. చిన్నపిల్లలకు గుండు చేయిచండం.. మూఢనమ్మకం కాదని.. సైన్స్ అని.. చాలా మంది పండితులు చెబుతారు.