
చేతిలో ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి అందులో నిజమెంతో, ఆబద్దమెంతో అర్థం కాని పరిస్థితి నెలకొంది.. ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్ వాడుతున్నారని మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఎవరిని నమ్మాలో, ఏ మెసేజ్ నిజమనుకోవాలో తెలియక ఇబ్బందులకు గురయ్యేవారి సంఖ్య పెరిగిపోతుంది.. ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మోసాలు సంఖ్య భారీగా పెరిగింది.. ఆ మోసాలపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ప్రశ్నకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన సమాచారం ఇది.
దేశంలోని వివిధ రంగాల బ్యాంకుల నుంచి గత పది సంవత్సరాలలో ఎన్ని మోసాలు జరిగాయి, ఎంతమంది ఎన్ని డబ్బులు పొగొట్టుకున్నారు.. అందులో ఎంత రికవరీ చేశారు.. ఇంకెంత రికవరీ చేయాల్సి ఉంది.. ఎంతమంది మోసగాళ్లపై ఎన్ని కేసులు నమోదు చేశారని భారతీయ రిజర్వ్ బ్యాంకుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా భారతీయ రిజర్వ్ బ్యాంకు పిఐవో అభయ్ కుమార్ పూర్తి వివరాలు వెల్లడించారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు..
రిజర్వ్ బ్యాంకు పిఐవో సమాచారం ప్రకారం దేశంలో వివిధ రంగాల బ్యాంకుల నుంచి ( షెడ్యూల్డ్ బ్యాంకులు) గత పది సంవత్సరాల నుంచి ఏటిఏం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల ద్వారా మొత్తం 305541 ఫిర్యాదులు నమోదయ్యాయి.. ఇందులో అత్యధికంగా 2017, 18 సంవత్సరంలో 4524కోట్లు రూపాయలు ఇంకా రికవరీ కాకుండా ఉన్నాయి..
2012-2022 సంవత్సరాలలో మొత్తం నష్టపోయిన రూపాయలు 5059కోట్లు,
2012-2022 సంవత్సరాలలో మొత్తం రికవరీ ఐనా రూపాయలు 171కోట్లు,
ఇందులో ఇంకా రికవరీ కావాల్సిన రూపాయలు 4887కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి..
2017 నుంచి 2022 వరకు దేశంలో షెడ్యూల్డ్, కమర్షియల్ బ్యాంకులో మోసం జరిగిందని దేశంలోని బ్యాంకులు 21742 ఫిర్యాదులను లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు అనగా సిబిఐ, ఆయా రాష్ట్రాల పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినట్టుగా స్పష్టం చేసింది..