
ఆదివారం సెలవు దినం అనేది దాదాపుగా ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉంటుంది. కాని ఇప్పటివరకు ఆ దేశంలో ఆదివారం సెలవు లేదంట. ఆదివారం కూడా పనిచేయాలని ఆ దేశపు అధ్యక్షుడు చెపుతారంట. ఆ దేశమే ఉత్తరకొరియా.. ఆ దేశ అధ్యక్షుడే కిమ్..
ఈ దేశంలోని ప్రజలకు ఆదివారం సెలవులు ఇవ్వరు. సెలవులు దేశ ప్రయోజనాల కోసం కాదని కిమ్ అంటుంటారట. ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి ఆదివారం సాధారణ పనిదినం వలె పని చేయాలి. ఇక్కడ దేశ ప్రగతికి మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. దీనిని ప్రజల దేశభక్తి లేదా నియంత భయం అని చెప్పవచ్చు. ఉత్తర కొరియాలో, ప్రతి వ్యక్తి ఆదివారం సాధారణ రోజులలో పనిచేస్తాడు. అత్యవసరమైనప్పుడు మాత్రమే ఆఫీసులో సెలవు ఇస్తారు. ఒక వ్యక్తి చాలా అనారోగ్యంతో అతను కూర్చోలేని స్థితిలో ఉంటే, అప్పుడు మాత్రమే ఇక్కడ సెలవులు ఇవ్వబడతాయి.
ఉత్తర కొరియా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు కేవలం ఆరు రోజులు మాత్రమే జీతం ఇస్తారు. అంటే ఆదివారం చేసే పని ఉచితం. దానికి ఎలాంటి రెమ్యూనరేషన్ అందదు. ఈ ఒక ఉచిత రోజు పనిని దేశ పురోగతికి ప్రజలు చేసిన సహకారంగా పరిగణించాలని అధినేత కిమ్ తెలిపారు. ప్రభుత్వోద్యోగి అయినా, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి అయినా అందరూ ఆదివారాలు ఉచితంగా పనిచేస్తారు. నియంత ప్రకారం సెలవు తీసుకోవడం దేశ ప్రయోజనాల కోసం కాదని.. ఇలా కాకుండా ఆదివారాలు హాయిగా పని చేస్తే దేశం పురోగమిస్తుందని కిమ్ చెబుతుంటారంట.