
నాసిక్ త్రయంబకేశ్వరం ఆలయంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. ప్రతిరోజు పూజలో భాగంగా పూజారులు పూజ చేయటానికి ఆలయంలో వెళ్లారు. పిండం చుట్టు తెల్లగా ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత.. అక్కడ తాకి చూశారు. శివలింగం గట్టిగా ఏర్పడి ఉంది. గర్భగుడిలోని ఆలయంలో లింగం చుట్టు మంచు వ్యాపించింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూజారులు దీన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. పూజారీ శివలింగం చుట్టు పువ్వులు పెట్టి అలంకరించారు.
ఆలయ పూజారులు.. శివలింగం (Trimbakeshwar Temple) పక్కన కూర్చుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. భారత్, చైనా యుధ్దం తర్వాత.. గతంలో..1962లో ఇలాగే నాసిక్ లో.. శివలింగం చుట్టు మంచు వ్యాపించిందని కథలుగా చెప్పుకుంటారు. ప్రస్తుతం మరోసారి మంచులాగా మారింది. అస్సాంలో వరదలు నేపథ్యంలో.. ఇప్పుడు మరోసారి శివలింగం చుట్టు మంచు వ్యాపించినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.