
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రి రోజురోజుకు శిథిలావస్థకు చేరుతోంది.. కొత్త ఆసుపత్రి నిర్మాణం చేపడుతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే రోగులు ఎప్పుడు పెచ్చులు మీద పడుతాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆసుపత్రి నిర్మాణాం ఎందుకు జాప్యం జరుగుతోంది. ఆసుపత్రి నిర్మాణానికి నిధుల లోపం కారణమా, మరే ఇతర కారణం ఉందా తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది.