కుటుంబాలు సమాజానికి వెన్నెముక వంటివి. అన్ని జీవాలను మించి మనుషులకు మాత్రమే ఉండే అరుదైన వరం. ఒక అదృష్టం. వసుదైక కుటుంబం అని చాటే భారతీయ జీవనశైలిలో కుటుంబాలు మొట్ట మొదటి పాఠశాలలు. అ- అమ్మ తో మొదలు పెట్టి అత్త తాత అనే బంధాలు నేర్పడం నుంచి మొదలుకుని పురాణాలు ఇతిహాసాలు అలవోకగా తాతలు పెద్దనాన్నలు కథల రూపంలో చెప్పే జీవిత పాఠాలు నేర్పేది మన ఉమ్మడి కుటుంబాలలోనే. అటువంటి కుటుంబాలలో పెరగడం వలన మంచి చెడు, బాధ్యత, మాటకారి తనం, పంచుకునే తత్వం, సహనం, ఓర్పు, నిస్వార్థం వంటి ఎన్నో సుగుణాలు, విలువలు. అదేనండి ఈ రోజు మనం చెప్పుకునే life skills and values సాధారణంగానే అలవడేవి. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక కుటుంబాన్ని కాదు సమాజాన్ని కూడా తనది భావిస్తూ గొప్ప వ్యక్తిత్వాలున్న మనుషులుగా ఎదిగేవారు, బాధ్యతా యుత పౌరులుగా తీర్చి దిద్దబడేవారు.
ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పట్నాల బాటలో విచ్ఛిన్నమై “nuclear ” కుటుంబ వ్యవస్థ వచ్చాక తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తెగాని గడవని రోజులతో, ఏ కాస్త సమయం ఇంట్లో ఉన్న అందులో ఎక్కువ శాతం సెల్ ఫోన్ లకే కేటాయిస్తూ.. ఎప్పుడో పెద్దయ్యాక పిల్లలకి ఏదో చేకూర్చాలని తాపత్రయంలో మనిషి శారీరక ఎదుగుదలకి మానసిక వికాసానికి ఎంతో ముఖ్యమైన “బాల్య దశష ను, ఏ బాలురైతే రేపు ఎదిగి సమాజానికి, దేశానికి తోడ్పడాల్సిన ఒక “తరం” ను ప్లే స్కూళ్లకు, ముక్కు పచ్చలారని నెలల పిల్లల్ని కథలు వినడానికి భావం నీతి చెప్పలేని, ఊహ శక్తిని తుంచేసె మొబైల్స్, ఐ ప్యాడ్, మాక్ బుక్ లకి బలిచేస్తున్నాం. ఇలాంటి వాతావరణంలో పెరిగే వీరు మేనత్తలు , బాబాయిలనే ఎవరో బంధువులుగా ఇంకా మాట్లాడితే ఆంటీ అంకుల్ గా భావించడం, అమ్మ నాన్నల నుంచే ప్రైవసీ కోరడం కొత్త ఏమి కాదు. ఒంటరితనం, ఆత్మన్యూనతతో ఇబ్బంది పడటం చూస్తున్నాము. స్వార్థం, నేర ప్రవృత్తి కలిగి ఉండే ఆస్కారం ఎక్కువ. సమాజంతో నాకేం సంబంధం అనే అకుంచిత భావాలతో ఎదగడం వింత ఏమికాదు. ఎప్పుడో ఏవో సుఖాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి పరుగులు పెట్టడం కన్న ఇప్పుడు పిల్లలకి సుగుణాలు, సద్భావలు, సంస్కారాలు ఇవ్వడం మిన్న. మంచి చెడు ఏది వచ్చినా తట్టుకుని నిలబడగల ధృడ చిత్తంతో సశక్తులను చేయడం ఎంతో అవసరం. మన కుటుంబంలో పిల్లలు మన మన నీడలో ఎదిగే భావితరాలు. వారిని సమాజాన్న, దేశాన్ని, ప్రపంచాన్ని, మానవ జాతిని నిలబెట్టాల్సిన ఆణిముత్యాలు గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనదే అని గ్రహిస్తూ మన కుటుంబ వ్యవస్థను మరల సరిదిద్దుకునే ప్రయత్నం ఈ రోజే మొదలు పెడదాం. అందరికీ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు!!!
డా. ప్రియదర్శిని
Wonderful thoughts with the explanation to understand the importance of teaching values n morals to children for a better society ❤️❤️❤️
meeru kuda rasi pampandi, mundadugu111@gmail.com contact number 9491114616