ఆర్టీసీ చ‌క్రాల కింద న‌లిగిపోతున్నారు…

Share On

సామాన్యుల నుంచి సంప‌న్నుల వ‌ర‌కు అంద‌రూ వాడే వాహానం ఆర్టీసీ.. ఆర్టీసీ ప్ర‌యాణం అంటే అందరికి ఒక న‌మ్మ‌కం.. ఎంత దూర ప్ర‌యాణ‌మైన సుర‌క్షితంగా గ‌మ్యానికి చేర్చుతాయ‌నే న‌మ్మ‌కంతో అంద‌రూ ఆర్టీసీ ఎక్కువ‌గా న‌మ్ముతారు.. అలాంటిది ఆర్టీసీ బ‌స్సుల కార‌ణంగా రోడ్డు ప్ర‌మాదాలు, మ‌ర‌ణాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి.. అస‌లు తెలంగాణ ఆర్టీసీలో ప్ర‌తి సంవ‌త్స‌రం ఎన్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి, ఎంత మ‌ర‌ణిస్తున్నార‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ స‌మాచార‌హ‌క్కు చ‌ట్టంతో ప్ర‌శ్నించ‌గా వారు ఇచ్చిన స‌మాచారంతో ప‌లు విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

ఆర్టీసీ అంటేనే సామాన్యుడి వాహనంగా పేరుగాంచింది. డబ్బున్న సంపన్నులు ఖరీదైన కార్లలో తిరిగితే.. పేద, మధ్యతరగతి వారు మాత్రం ఎక్కువగా నమ్ముకునేది మాత్రం ఆర్టీసీనే.. దూర ప్ర‌యాణ‌మైతే సంప‌న్నులు కూడా ఆర్టీసీనే వాడుకుంటారు.. ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే ప్రచారం.. ప్రభుత్వం ప్రయాణీకుల్లో కల్పిస్తోంది.. కాని ప్ర‌తి సంవ‌త్స‌రం ఆర్టీసీ రోడ్డు ప్రమాదాల ద్వారా వేలాది మంది గాయాల పాలవగా, వందలాది మంది ప్రాణాలు కొల్పొతున్నారు. గత ఆరేళ్లలో ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన రోడ్డు ప్రమాదాలెన్ని.. అందులో మరణాలెన్ని అని యూత్ ఫర్ యాంటీకరప్షన్ సంస్థ సమాచారహక్కు చట్టంతో ప్రశ్నించగా, ఆర్టీసీ అధికారులు ఇచ్చిన సమాచారంతోనే పలు ఆధారాలను బయటపెట్టింది..

2015-16 సంవత్సరంలో 827 ఆర్టీసీ రోడ్డు ప్రమాదాలు జరగగా, అందులో 402 మంది చనిపోయారు.

2016-17లో 792 ప్రమాదాలు జరగగా, 367 మంది చనిపోయారు.

2017-18లో 729 ప్రమాదాలు జరగగా, 302 మంది ప్రాణాలు కొల్పొయారు.

2018-19లో 772 ప్రమాదాలు జరగగా, 407మంది బలయ్యారు.

2019-20లో 730 ప్రమాదాలు జరగగా, 327మంది ప్రాణాలు కొల్పొయారు.

2020- 2021 లో 443 ప్రమాదాలు జరగగా, 194 మంది మరణించారు.

గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4293 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఆర్టీసీ ప్రగతి చక్రాల కింద ప్రాణాల కింద ప్రాణాలు కొల్పొయింది 1.999 మంది..

ఆర్టీసీ ఉద్యోగ‌లుకు చాలా ప్రాంతాల‌లో డ్యూటీల మీద డ్యూటీల వేయ‌డంతో వారు మానసిక ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని తెలుస్తోంది.. ఆర్టీసీ ఉద్యోగుల‌లో ఉత్సాహాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వారికి ప్ర‌తి నెల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసి వారిలో మ‌నోదైర్యాన్ని పెంచాల్సిన బాధ్య‌త ఉంది. ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ సంస్థలోని ఉన్నతాధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, రోడ్డు ప్రమాదాల నివారణకు అడ్డుకట్డవేయాలని ప్రయాణీకులు కొరుతున్నారు.. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించాల‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu