అదో వింత ఆచారం.. ఐదు రోజులు మ‌హిళ‌లు న‌గ్నంగా ఉండాలి..

Share On

మ‌న దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంది.. పూర్వీకుల నుంచి వ‌చ్చిన ఆచార‌వ్య‌వ‌హారాల‌ను ఇప్ప‌టికి పాటిస్తూనే ఉన్నారు. త‌మ ఆచార, సంప్ర‌దాయాల‌ను ఇప్ప‌టికి భ‌ద్రంగా కాపాడుకుంటున్న తెగ‌లు చాలా ఉన్నాయి.. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్న్ వ్యాలీ ప్రజల్లో ఒక వింత ఆచారం ఉంది.. వారు ఇప్ప‌టికి దానిని పాటిస్తున్నారు.

భారత దేశంలో నగ్నత్వం అనేది త‌ప్పుగా భావిస్తారు. కాని పిని గ్రామానికి చెందిన ప్రజలకు మాత్రం అది సంప్రదాయం. వారి ఆచారం ప్రకారం.. అక్కడి మహిళలు ఐదు రోజులు నగ్నంగా ఉండాలి. ప్రతి రోజు నగ్నంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏడాదిలో ఐదు రోజులు మాత్రమే అలా ఉండాలి. కొత్తగా పెళ్లయిన వధువు సైతం.. ఐదు రోజులు నగ్నంగా ఉండాలి. ఆ 5 రోజులు భర్తకు దూరంగా ఉండాలి. వారు న‌గ్నంగా ఉన్న ఐదు రోజులు ఇంట్లో ఎవరూ కనీసం నవ్వకూడదు. నగ్నంగా ఉన్న ఐదు రోజులు మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లరు. అలాగే బయట వ్యక్తులు కూడా వారిని చూడకూడదు. దానివల్ల వారు నగ్నంగా ఉన్నా.. ఎలాంటి భయం లేకుండా గడుపుతారు.1

గ్రామంలోని మహిళలు ఈ సంప్రదాయాన్ని పాటించకపోతే వారి ఇంట్లో అశుభం కలుగుతుందని, చెడు వార్త వినాల్సి వస్తుందని భావిస్తారు. ఈ సంప్రదాయం ప్రారంభం కావడం వెనుక ఒక కథ దాగి ఉంది. ఒకప్పుడు ఒక‌ రాక్షసుడు పిని గ్రామాన్ని పీడించేవాడు. దుస్తులు ధరించిన అందమైన వివాహిత మహిళలను ఎత్తుకుపోయేవాడు. దీంతో అక్కడి మహిళలు దుస్తులు విప్పేసి.. తమని రక్షించాలని దేవతలను వేడుకున్నారు. వారి మొర అలగించిన దేవతలు ఆ రాక్షసుడిని సంహరించి.. గ్రామ మహిళలను రక్షించారు. అప్పటి నుంచి అక్కడి మహిళలు ఏడాదిలో ఐదు రోజులు నగ్నంగా ఉంటున్నారు. ఆ ఐదు రోజులు వారు బయట ప్రపంచానికి దూరంగా ఉంటారు. పురుషులే కాదు.. స్త్రీలు కూడా వారిని చూడరు. శ్రావణ మాసంలో ఎక్కువగా సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలు లహువా దేవతకు పూజలు చేస్తారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu