అది ప్ర‌పంచంలోనే పొడ‌వైన రైలు.. కాని

Share On

అది ప్ర‌పంచంలోనే అత్యంత పొడ‌వైన రైలు.. కానీ ఆ రైలులో ప్రయాణీకులు కూర్చోవడానికి సీట్లు మాత్రం ఉండవు. ఒక్క టాయిలెట్ కూడా ఉండదు. మరి ఇంత పెద్ద రైలులో కనీస‌ వసతులు మాత్రం ఉండ‌వు.. అత్యంత పొడ‌వైన ఆ రైలు ఆఫ్రిక‌న్ దేశంలో ప్ర‌యాణిస్తోంది..

ఆఫ్రికన్ దేశంలోని మౌరిటానియాలో నడిచే ఈ రైలు గూడ్స్ రైలు. కాని ఇందులో ప్ర‌యాణీకులు కూడా ఉంటారు. ప్రాణాలను పణంగా పెట్టి ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. ఈ రైలులోని కోచ్‌లలో కనీసం కూర్చోవడానికి సీటు కూడా లేదు. టాయిలెట్ కూడా లేదు. ఈ మౌరిటానియాలో నడిచే ఈ ‘ట్రైన్ డు డిజర్ట్’ 1963 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ రైలు సహారా ఎడారి గుండా 704 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 2 కిలోమీటర్లు పొడవు ఉండే ఈ 704 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 20 గంటలు పడుతుంది.

3 నుండి 4 డీజిల్ ఇంజన్లతో అనుసంధానమై ఉంటుంది. ఈ రైలు మౌరిటానియాలోని నౌదిబౌ, జురత్ నగరాల మధ్య నడుస్తుంది. ఈ రైలులో 200 నుండి 210 సరుకు రవాణా రైలు కోచ్‌లు ఉన్నాయి. ఒక కోచ్ ప్రయాణీకుల కోసం ఉంది. ఆఫ్రికన్ దేశంలోని డిజర్ట్ సమాజానికి చెందిన వారు ఈ రైలులో ప్రయాణిస్తారు. దీంతో రోడ్డు దూరం 500 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ ప్రాంతంలోని వారికి ఈ రైలు జీవనాధారంవంటిది. పని పరంగా, కుటుంబ సభ్యులను కలవడానికి ఈ రైలు వారికి అనువైన మార్గం. ఈ రైలులో ప్రయాణించేవారు 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను భరించవలసి ఉంటుంది. ఎందుకంటే అది సహారా ఎడారి కాబట్టి. ఇక రాత్రి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ సెల్సియస్ కంటే దిగువకు నమోదవుతుంటుంది. ఇన్ని కష్ట నష్యాలకు ఓర్చుకుని ఈ రైలులో ప్రయాణిస్తుంటారు ప్రయాణీకులు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu