అప్పుల పాలై ఆత్మ‌హ‌త్య చేసుకున్న స‌ర్పంచ్‌..

Share On

గ్రామాభివృద్ది స‌ర్పంచ్‌ చేతుల్లోనే ఉంటుంది. గ్రామానికి అవ‌స‌ర‌మ‌య్యే ప‌నులు ఎంచుకొని స‌ర్పంచ్ ప‌నులు చేపిస్తారు.. ప‌నులు చేసిన స‌రియైన స‌మ‌యంలో బిల్లులు రాక‌పోతే వారి ఇబ్బందులు మామూలుగా ఉండ‌వు.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వంలో స‌కాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ప‌తున్నారు. అభివృద్ది కోసం తీసుకు వ‌చ్చిన అప్పులకు వ‌డ్డీలు పెర‌గడంతో స‌ర్పంచ్‌లు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక‌ స‌ర్పంచ్ భ‌ర్త అప్పుల పాలై చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో అప్పుల వాళ్లు డ‌బ్బులు అడ‌గ‌డంతో వారికి అప్పు క‌ట్టే ప‌రిస్థితి క‌నిపించలేదు. దీంతో చేసేదేమి లేక‌ బుధవారం వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ భర్త మల్లేష్. అతడ్ని వైద్యం కోసం ఆర్మూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుప‌త్రి వైద్యులు చికిత్స అందించారు. గురువారం తెల్లవారుజాముల మ‌ల్లేష్ చికిత్స‌ పొందుతూ మృతి చెందాడు. సర్పంచ్ భర్త మల్లేష్ మృతితో వడ్డెర కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్వ‌యానా జిల్లా మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని స‌ర్పంచ్ భ‌ర్త బిల్లులు రాక ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం చ‌ర్య‌నీయ ఆంశంగా మారింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu