
దేశంలో నోట్ల రద్దు తర్వాత విచ్చలవిడిగా విడుదల చేసిన కొత్త నోట్లలో ఎక్కువ శాతం రెండు వేల నోట్లే ఉన్నాయి.. కాని గత కొన్ని నెలలుగా దేశంలో రెండు వేల నోట్లు ఎక్కడ కనిపించడం లేదు. రెండు వేల నోట్ల కొరత ఎందుకు ఏర్పడింది. రెండు వేల నోట్లు ప్రింట్ అవుతున్నాయా, లేదా పూర్తిగా బంద్ చేశారా.. ప్రింట్ బంద్ చేస్తే ఎందుకు బంద్ చేశారో అందుకు గల కారణాలు తెలపాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నుంచి భారత రిజర్వ్ బ్యాంకు నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసినట్లు సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.