కోర్టులో భార్య‌తో క‌లిసి ఉంటాన‌ని చెప్పాడు.. కాని

Share On

త‌న భార్య‌తో క‌లిసి ఉంటాన‌ని ఒక భ‌ర్త కోర్టులో చెప్పాడు.. కోర్టు హాల్ నుంచి బ‌య‌టికి రాగానే అంద‌రూ చూస్తుండ‌గానే ఒక వ్య‌క్తి త‌న భార్య గొంతు కోసి చంపేశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. భార్యతో కలిసి ఉంటానని కోర్టుకు చెప్పిన కొన్ని క్షణాల్లోనే.. అతడు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో జ‌రిగింది.

హసన్‌ జిల్లాకు చెందిన శివకుమార్‌, చైత్రకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మధ్య మనస్పర్థలు రావడంలో ఇటీవల హోలెనరాసిపుర ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకొన్నారు. ఈ క్రమంలో కౌన్సిలింగ్‌ సెషన్‌కు వీరు హాజరయ్యారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసి ఉంటామని అధికారులకు తెలియజేశారు. అంతలోనే ఏమైందో ఏమో.. శివకుమార్‌ భార్యపై దాడికి పాల్పడ్డాడు. కౌన్సిలింగ్‌ సెషన్‌ అనంతరం చైత్ర వాష్‌రూమ్‌కి వెళ్తుండగా.. భర్త అడ్డుకుని కత్తితో గొంతు కోశాడు. వెంటనే అక్కడున్నవారు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. పారిపోయేందుకు ప్రయత్నించిన శివకుమార్‌ను అక్కడున్నవారు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ‘కౌన్సిలింగ్‌ అనంతరం హత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టాం. కోర్టు ఆవరణలోకి అతడు కత్తిని ఎలా తీసుకువచ్చాడనే విషయంపై కూడా ఆరా తీస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu