తిరుమ‌ల‌లో భారీగా పెరిగిన ర‌ద్దీ..

Share On

తిరుమ‌ల తిరుప‌తిలో భ‌క్తుల ర‌ద్దీ భారీగా పెరిగింది. గత ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు అధికంగా తరలివస్తున్నారు. శనివారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆరు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లు సేవాసదన్‌ దాటి రింగ్‌రోడ్డుకు వరకు భక్తుల క్యూ చేరుకుంది.

మరోవైపు శ్రీవారి దర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. భక్తులు రద్దీకి అనుగుణంగా తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని.. లేదంటే వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు. శనివారం 83,422 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు తితిదే తెలిపింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu