ఈజిప్ట్ చ‌ర్చిలో ఘోర అగ్నిప్ర‌మాదం.. 41మంది స‌జీవ‌ద‌హ‌నం..

Share On

ఈజిప్ట్ కైరోలోని ఒక కాప్టిక్ చ‌ర్చిలో ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. మరో 14 మంది గాయపడినట్లు ఈజిప్ట్ అధికారులు వెల్లడించారు. కైరోఉన్న అబూ సెఫీన్ చర్చి చాలా ఫేమస్. ఇక్కడికి ప్రతి ఆదివారం క్యాప్టిక్ క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ ఆదివారం కూడా చాలా మంది చర్చికి వచ్చి ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలోనే చర్చిలో మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లటి పొగలు.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో.. వాటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి కొందరు చనిపోయారు. దట్టమైన పొగలతో మరికొందరు ఊపిరాడక మరణించారు. ఇంకొందరు మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. చర్చి లోపల షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మధ్యప్రాచ్యంలో కాప్ట్స్‌కు అతిపెద్ద క్రైస్తవ సామాజికవర్గంగా పేరుంది. ఈజిప్టులోని 10.3 కోట్ల జనాభాలో కనీసం కోటి మంది కాప్ట్ క్రైస్తవులు ఉన్నారు. ఈజిప్ట్‌లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కొంతకాలంగా మైనారిటీలపై వివక్షతో పాటు దాడులు పెరిగిపోతున్నాయి. 2013లో మాజీ ఇస్లామిస్ట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మోర్సీని పదవీచ్యుతుడిని చేసి సిసి పగ్గాలు చేపట్టిన తర్వాత… కాప్ట్స్ క్రైస్తువులను కొందరు ఇస్లామిస్ట్‌లు టార్గెట్ చేసుకున్నారు. చర్చిలు, పాఠశాలలు, ఇళ్లను తగులబెట్టినట్టు వారిపై ఆరోపణలున్నాయి. ఈజిప్ట్ ప్రెసిడెంట్ సిసి ఇటీవలే చరిత్రలో మొదటిసారిగా రాజ్యాంగ న్యాయస్థానానికి నాయకత్వం వహించడానికి కాప్టిక్ న్యాయమూర్తిని నియమించారు. ఆ తర్వాత చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఈ పరిణామల క్రమంలోనే అబూ సెఫీన్ చర్చిలో మంటలు చెలరేగి.. 41 మంది చనిపోవడం సంచలనం రేపుతోంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu