న‌గ‌రంలో పార్కుల మెయింట‌నెన్స్‌కు భారీ ఖ‌ర్చు..

Share On

హైద‌రాబాద్ అంటేనే బిజీబిజీ జీవితం.. ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌గ్న‌మైపోతారు.. అల‌సి పోయిన మ‌నుషులు కాస్త సేద తీర‌డానికో.. ఇర‌వై నాలుగు గంట‌లు పుస్త‌కాల‌కు అంకిత‌మ‌వుతున్న విద్యార్థుల‌కు కాస్త ఆనందం పంచ‌డానికో ఇక్క‌డ ఆట‌స్థ‌లాలు, అడ‌వులు అంటూ ఏమి ఉండ‌వు.. కాంక్రీటు న‌గ‌రంలో న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు కాస్త ఉల్లాసాన్ని ఇవ్వ‌డానికి జిహెచ్ఎంసీ ప‌రిధిలో కొన్ని పార్కులు ఉన్నాయి.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎన్ని పార్కులు ఉన్నాయి, వాటి మెయింట్‌నెన్స్‌కు ఎంత ఖ‌ర్చు చేస్తున్నార‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ జిహెచ్ఎంసీకి స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేయగా జిహెచ్ఎంసీ అర్బ‌న్ బ‌యోడైవ‌ర్శిటీ వింగ్ డైరెక్ట‌ర్ పూర్తి వివరాల‌ను అందించారు..

హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప‌రిధిలోని మొత్తం నాలుగు జోన్లు ఉన్నాయి. ఆ నాలుగు జోన్ల‌లో 483 పార్కులు ఉండ‌గా వాటి మెయింటెనెన్స్‌కు ఒక్క సంవ‌త్స‌ర‌మే దాదాపు ప‌ది కోట్లు ఖ‌ర్చు చేశారు. సికింద్రాబాద్ జోన్‌లో 90 పార్కులు ఉండ‌గా, ఆ పార్కుల‌ మెయింట్‌నెన్స్ కోసం ఎనిమిది నెల‌ల్లో 72ల‌క్ష‌లు పైగా ఖర్చు చేశారు. చార్మినార్ జోన్‌లో 120 పార్కులు ఉండ‌గా, వాటి మెయింట్‌నెన్స్ కోసం ఎనిమిది నెల‌ల్లో మూడున్న‌ర కోట్లు ఖ‌ర్చు చేశారు. చార్మినార్ జోన్‌లో కాంట్రాక్ట‌ర్లు మెయింట‌న్ చేసే పార్కులు 16 ఉండ‌గా, వీటికి కోటి 35ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారు. చార్మినార్ జోన్ ప‌రిధిలో రెండు పార్కులు క‌బ్జాకు గుర‌య్యాయి. అవి జ‌న‌చైత‌న్య పార్కు 11, జ‌న‌చైత‌న్య పార్కు 23గా తెలిపారు. కూక‌ట్‌ప‌ల్లి జోన్‌లో 156 పార్కులు ఉండ‌గా వాటి మెయింట‌నెన్స్ కోసం ఎనిమిది నెల‌ల్లోనే రెండున్న‌ర కోట్లు పైగా ఖ‌ర్చు చేశారు.

ఖైర‌తాబాద్ జోన్ పార్కుల‌కే ఎక్కువ ఖ‌ర్చు..

ఖైర‌తాబాద్ జోన్‌లో 117 పార్కులు ఉండ‌గా ఒక సంవ‌త్స‌రానికి మూడు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లుగా తెలిసింది. ఇందులో అత్య‌ధికంగా బంజారాహిల్స్‌లోని కెబిఆర్ పార్క్ కోటి ప‌దిహేను ల‌క్ష‌లు, జ‌ల‌గాం వెంగ‌ళరావు పార్కుకు 32 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారు. లోట‌స్ పాండ్ పార్కుకు 20 ల‌క్ష‌లు, జూబ్లిహిల్స్‌లోని హెర్బ‌ల్ గార్డెన్ 14ల‌క్ష‌లు, హెర్బ‌ల్‌ గార్డెన్ 14ల‌క్ష‌లు, ల్యాండ్ స్కేప్ పార్కు 10ల‌క్ష‌లు పైగా ఖ‌ర్చు చేశారు. ప్ర‌తి సంవ‌త్స‌రం కోట్లాది రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు అధికారులు ఇచ్చిన స‌మాచారంలో ఉందని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర తెలిపారు. మెయింట్ నెన్స్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్న కొన్ని పార్కుల్లో పరిస్థితి ఏలా ఉందో తాము తనిఖీ చేసి పూర్తి వివరాలు బయట పెడతామని వారు తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu