ఇంకా.. ప్ర‌పంచంలో రాజులు పాలిస్తున్న రాజ్యాలు ఉన్నాయి..

Share On

రాజులు పోయాయి.. రాజ్యాలు పోయాయి.. నాయ‌కులు వ‌చ్చారు.. ప్ర‌జాస్వామ్యాలు వెలిశాయి.. ప్ర‌భుత్వాలు, అధికారులు అంద‌రూ వ‌చ్చారు.. ఓట్ల‌తో నాయ‌కుల‌ను ఎన్న‌కుంటున్నాం.. ప్ర‌పంచంలో రాజులు ప‌రిపాల‌న పోయింద‌నుకుంటే మాత్రం పొర‌పాటే.. ఎందుకంటే ఇంకా ఎనిమిది దేశాల్లో ఇప్ప‌టికే రాజుల పాల‌న‌నే న‌డుస్తోంది.. అక్క‌డ ఎన్నిక‌ల ఉండ‌వు.. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు వార‌స‌త్వంగా వారిదే అక్క‌డ రాజ్యం.. అక్క‌డి ప‌ద్ద‌తులు, ఆచారాలు, శిక్ష‌లు, న్యాయం అంతా అక్క‌డి రాజులు చెప్పిన‌ట్టే జ‌రుగుతోంది.. ఆ రాజ్యాలెంటో ఒక్క‌సారి తెలుసుకుందాం..

బ్రిటన్, బూటాన్, థాయిలాండ్ వంటి దేశాలలో రాజులు మహారాణులు కనిపిస్తున్న వాళ్ళు నామమాత్రపుగానే కొనసాగుతున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని దేశాలలో సర్వాధికారము తన చేతుల్లో పెట్టుకొని దేశాన్ని ఏలుతున్న రాజులు ఉన్నారు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్‌కు ఖలీఫా బిన్ జాయెద్ రాజుగా, దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా, ఉమ్ ఆల్ కువైట్, ఆజ్మాన్, పూజైరా, రస్ అల్ ఖైమా వంటి ఏడు ప్రాంతాలను ఒక ప్రాంతానికి చెందిన షేక్ పరిపాలిస్తాడు. అబుదాబి షేక్‌లు అధ్యక్షత వహించగా, దుబాయ్ షేక్‌లు ప్రధానిగా వ్యవహరిస్తారు. ఈ దేశాలలో అధ్యక్షుడు చెప్పినదే న్యాయం.

ప్రస్తుతం సౌదీ అరేబియాలో సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌదీ చక్రవర్తిగా మరియు ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్ ఉప ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. 1880వ శతాబ్దంలో అరేబియా ద్వీపకల్పంలో మహ్మద్ బీన్ సౌదీ అనే వ్యక్తి సౌదీ రాజ్యాన్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఆయన కుటుంబం సౌదీని సౌదీ అరేబియాగా మార్పిడి చేసి పరిపాలన కొనసాగిస్తోంది. ఈ రాజకుటుంబాల చేతుల్లోనే శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాలు ఉంటాయి. ఈ రాజకుటుంబానికి చెందిన దాదాపు రెండు వందల మంది యువ రాజులు ఈ కీలక పదవులు వ్యవహరిస్తారు.

ఒమన్‌లో కబూస్ బిన్ సౌదీ మరణానంతరం ఆయన సోదరుడు హైతమ్ బిన్ తారిక్ చక్రవర్తిగా వ్యవహరిస్తున్నారు. 18వ శతాబ్దంలో ఆల్ బుసైదా వంశస్థులు అరేబియా ద్వీపకల్పంలో ఆగ్నేయం వైపు ఉన్న ఒమన్‌ను పాలిస్తూ వస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఒమన్ శక్తివంతమైన రాజ్యంగా మారింది.

అతిపెద్ద ద్వీపాలలో ఒకటైన బోర్నియోలో బ్రునై దేశం ఉంది. బ్రునై దేశానికి హాస్పనల్ బోల్కియా 29వ రాజుగా ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్నారు. తండ్రి ఒమర్ అలీ సైఫుద్దీన్ వారసుడిగా 1967లో హాస్పనల్ బాధ్యతలు చేపట్టారు. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఇస్లామిక్ రాజరికపు నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. 1984 లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన, ఇక్కడ అధికారాన్ని చక్రవర్తికే ఉంటాయి. పార్లమెంటు ఉన్నప్పటికీ ఎన్నికలు ఉండవు.

స్వాజీలాండ్ అనే దేశం ఆఫ్రికా ఖండంలోని దక్షిణ భాగంలో ఉంటుంది. 1800 శతాబ్దంలో గ్వానె III ఆధ్వర్యంలో స్వాజిలు ఇక్కడ రాజ్యాన్ని స్థాపించారు. 1993 నుంచి బ్రిటిష్ పాలనలో ఉన్న ఈ దేశం 1962 సెప్టెంబర్ 6వ తేదీన స్వాతంత్య్రం పొందింది. స్వాతంత్య్రం పొందిన అనంతరం స్వాజీల్యాండ్‌ను కింగ్‌డ‌మ్‌ ఆఫ్ ఎస్వటినిగా నామకరణం చేశారు. ఇక్కడ ఐదేళ్లకొకసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కానీ ప్రభుత్వాన్ని చక్రవర్తే పాలిస్తారు.

ఇటలీలోని ఆధ్యాత్మిక నగరం వాటికన్ సిటీ. 1929లో చేసుకున్న లేటరన్ ఒప్పందం ప్రకారం వాటిక‌న్ సిటీ స్వాతంత్రం సంపాదించుకుంది. ఇక్కడ మొత్తం అధికారం కాథలిక్ చర్చి హెడ్ అయిన రూమ్ బిషప్ పోప్‌కే ఉంటాయి. 121 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ దేశంలో కేవలం 805 మంది జనాభా మాత్రమే ఉంటారు. ప్రపంచంలోనే అతి చిన్న స్వల్ప దేశంలో వాటికన్ సిటీ ఒకటి. వాటికన్ సిటీ బాధ్యతను పోప్ ఫ్రాన్సిస్ నిర్వహిస్తారు.

బహ్రేయిన్ దేశానికి షేక్ హమద్ బిన్ ఈసా అలీ ఖలీఫా చక్రవర్తి గా ఉన్నారు. ఈ దేశంలో ప్రభుత్వం ఉన్నా, ప్రధాన మంత్రుల నుంచి మంత్రుల వరకూ అందరినీ చ‌క్ర‌వ‌ర్తి నియమిస్తారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో అలీ కలీఫా కుటుంబ సభ్యులు ఉంటారు.

ఖతర్ రాజవంశస్థుడైన ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని ప్రస్తుతం రాజుగా వ్యవహరిస్తున్నారు. ప్ర‌పంచంలో ఇంకా కొన్ని దేశాలు మాత్రం రాజకుటుంబాలు, ప్రభుత్వం కలిసి సంయుక్తంగా పరిపాలిస్తుంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu