
తెలంగాణ ప్రభుత్వంపై పలు ఆర్టీఐ దరఖాస్తులను ఫైల్ చేసినట్టు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి, సంస్థ సభ్యులు కొన్నె దేవేందర్, కొమటి రమేష్‌బాబు, బి. రాజేశ్, గంగాధర్, అంజుకర్, హరిప్రకాశ్ తెలిపారు.
- తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖలలో డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వారి సంఖ్య వివరాలు..
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి హోదాలో సిఎం వివిధ సభలు, సమావేశాలలో ఎన్ని హామీలు ఇచ్చారు. అందులో ఎన్ని నేరవేర్చారు. ఇంక ఎన్ని హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి వివరాలు..
- తెలంగాణ ముఖ్యమంత్రి అవినీతి నిర్మూలన కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దానికి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ నెంబర్ ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తోంది..
- తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు. సంవత్సరాల వారీగా పూర్తి సమాచారం..
- 75వ వజ్రోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది. ఎన్ని జిల్లాలకు ఎన్ని నిధులు మంజూరు చేసింది. వీటిపై పూర్తి సమాచారం.
- ఎమ్మెల్యె, మంత్రులు, ప్రగతి భవన్‌కు ప్రతి నెల ఎంత కరెంట్ బిల్లు వస్తుంది.. ప్రతి నెల చెల్లిస్తున్నారా, లేదా వాటి వివరాలు..
పై అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత శాఖకు దరఖాస్తు చేశామని వారు తెలిపారు.