హైద‌రాబాద్ రోడ్ల శుభ్ర‌త‌కు నెల‌కు రెండు కోట్లకు పైగా ఖ‌ర్చు

Share On

ముంద‌డుగు బృందం ప్ర‌త్యేక ఆర్టీఐ క‌థ‌నం..

చిన్న గాలి వీస్తే చాలు.. దుమ్ము లేచిపోతుంది.. మోటార్ సైకిల్ పై వెళ్లే వాహనదారులు ఆ దమ్ముకు నానా ఇబ్బందులు పడుతారు.. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద విచ్చలవిడిగా తినుబండారాలు అమ్ముతారు.. వాహనాల రాకపోకలతో దుమ్ములేస్తూ వాటిని కమ్ముకపోతాయి.. గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన రోడ్లతో పాటు గల్లీ రోడ్లపై కూడా దుమ్ము లేస్తూనే ఉంటుంది.. రోడ్లను ఎప్పుడు ఊడుస్తారా, రోడ్లను క్లీన్ చేసే మిషన్ల ద్వారా ఎప్పుడు శుభ్రం చేస్తారో దాదాపుగా చాలామందికి తెలియదు.. రోడ్ల క్లీనింగ్ కోసం అసలు ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా తెలియదు.. ప్రతి నెల ఎన్ని నిధులు మంజూరు చేస్తున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేసింది యూత్ ఫర్ యాంటీకరప్షన్ సంస్థ..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి రోజు రెండు సార్లు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ఉదయమేమో గల్లీ రోడ్లెమో కార్మికులతో శుభ్రం చేస్తే, సాయంత్రమెమో స్వీపింగ్ యంత్రాల ద్వారా క్లీన్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్లను శుభ్రం చేయడానికి ఎన్ని స్వీపింగ్ యంత్రాలు ఉన్నాయి. అందులో ఎన్ని రకాలున్నాయి. ఒక నెలకు ఒక్కొ మిషన్ కు ఎంత ఖర్చు అవుతోందని జిహెచ్ఎంసికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నుంచి సమాచారహక్కు చట్టం దరఖాస్తు చేయగా బల్దియా చీఫ్ ట్రాన్స్ ఫోర్ట్ అధికారి పూర్తి వివరాలను అందించారని సంస్థ పౌండర్ రాజేంద్ర తెలిపారు..

నగరంలో రోడ్లను శుభ్రం చేయడానికి 43 మార్గాల్లో 35 స్వీపింగ్ యంత్రాలు ప్రతిరోజు పనిచేస్తున్నాయి. వాటి నిర్వహణ కోసం ప్రతి నెల 16లక్షలకు పైగా బల్దియా ఖర్చు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 12 కాంపాక్ట్ వాక్యూమ్ స్వీపర్లు, 5 ట్రక్కు మౌంటెండ్, 18 స్వీయ చోదక యంత్రాల వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

రోడ్లు క్లీనింగ్ కోసం మూడు రకాల మిషన్లను వాడుతున్నారు. 12 కాంపాక్ట్ వాక్యూమ్ స్వీపర్లు 19 మార్గాల్లో పనిచేస్తున్నాయి. గంటకు 820రూపాయలు ఖర్చు చేయగా. ఒక్క యంత్రానికి నెలకు ఖర్చు 2.46.000 ఖర్చవుతోంది..

5 ట్రక్కు మౌంటెడ్ స్వీపింగ్ మిషన్లు 6 మార్గాల్లో పనిచేస్తున్నాయి. అందుకు ఒక్క మిషన్ కి గంటకు 1459 రూపాయలు ఖర్చు చేయగా, ఒక్క యంత్రానికి 4లక్షల 37వేల 700రూపాయలు ఖర్చు చేస్తున్నారు..

18 స్వీయ చోదక యంత్రాలను అద్దెకు తీసుకున్నారు. అవి 18 మార్గాల్లో పనిచేస్తున్నాయి.. ఒక్క యంత్రాంగానికి గంటకు 3105 రూపాయలు ఖర్చు చేయగా, నెలకు 9లక్షల 31వేల 500రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. అంటే ప్రతి నెల రోడ్ల క్లీనింగ్ కోసం ఒక్క మిషన్ల ద్వారా రెండు కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు జిహెచ్ఎంసీ చీఫ్ ట్రాన్స్ ఫోర్ట్ అధికారి తెలిపారు.

ప్రతి నెల రోడ్ల శుభ్రత కోసం లక్షల రూపాయల ఖర్చు చేస్తున్నారు. ఐనా పలు ప్రాంతాల్లో దుమ్ము లేస్తేనే ఉందని వాహనదారులు అంటున్నారు. యంత్రాల పనితీరు ఏలా ఉందో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ బృందం జిహెచ్ఎంసి అధికారులను కోరింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu