ప్రియురాలి న‌గ్న చిత్రాల‌ను ఆన్‌లైన్‌లో ఎక్కించిన డాక్ట‌ర్‌..

Share On

ఒక యువ డాక్ట‌ర్ ప్రియురాలి న‌గ్న చిత్రాల‌ను ఆన్‌లైన్‌లో పెట్టాడు. దీంతో ప్రియురాలు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తూ త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆ డాక్ట‌ర్‌ను చంపేసింది. ఈ సంఘ‌ట‌న బెంగుళూరులో జ‌రిగింది.

బెంగళూరులో పనిచేస్తున్న డాక్టర్‌ వికాస్‌ రాజన్‌ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. అతడు తొలుత చెన్నైలోని ఓ వైద్యశాలలో కొన్నాళ్లు పనిచేసి తర్వాత బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతడు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించడానికి ఆసక్తి చూపేవారికి శిక్షణ ఇచ్చేవాడు. డాక్టర్‌ వికాస్‌కు రెండేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో ప్రతిభా అనే యువ ఆర్కిటెక్ట్‌ పరిచమైంది. వీరు సహజీవనం ప్రారంభించారు. త్వరలో పెళ్లి కూడా చేసుకొందామని అనుకొన్నారు. ఇరువురి కుటుంబీకులు ఇందుకు అంగీకరించారు. ఈ క్రమంలో వారం క్రితం వికాస్‌ తీవ్ర గాయాలతో వైద్యశాలలో చేరాడు. వెంటనే కోమాలోకి జారుకొన్నాడు. మూడు రోజుల క్రితం అతడు మరణించాడు.

వికాస్‌ శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో అసహజ మరణంగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి విస్తుగొలిపే వాస్తవాలు తెలిశాయి. ప్రతిభా, ఆమె స్నేహితులే వికాస్‌ను తీవ్రంగా కొట్టి ఆసుపత్రిలో చేర్చినట్లు తేలింది. తూర్పు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ సీకే బాబా కథనం ప్రకారం.. ప్రతిభా నగ్నచిత్రాలు ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కనిపించాయి. ఈ విషయంపై ఆమె వికాస్‌తో గొడవపడింది. తానే ఫేక్‌ ఐడీ సృష్టించి సరదాగా వాటిని పోస్టు చేసినట్లు వికాస్‌ అంగీకరించాడు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన ప్రతిభా అతడికి గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకొంది . సెప్టెంబర్‌ 10వ తేదీన తన మిత్రుల వద్ద ఆమె ఒక గెట్‌టుగెదర్‌ను ఏర్పాటు చేసింది. దీనికి వికాస్‌ను కూడా తీసుకెళ్లింది. అక్కడ మద్యం తాగాక ప్రతిభా మిత్రులు-వికాస్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ క్రమంలో ప్రతిభా స్నేహితులు ఇల్లు శుభ్రం చేసే పరికరాలతో వికాస్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడటంతో వారే వైద్యశాలలో చేర్పించారు. ఓ ఘర్షణలో వికాస్‌ గాయపడ్డాడని.. పోలీస్‌ కేసు రిజిస్టర్‌ అయిందని ప్రతిభా అతడి సోదరుడితో అబద్ధం చెప్పినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ప్రతిభా, ఆమె స్నేహితులు గౌతం, సుశీల్‌, సునీల్‌లను అరెస్టు చేశారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu