43 ఏళ్ల‌లో 53మందిని వివాహం చేసుకున్నాడు.. ఐనా

Share On

ఒక వ్య‌క్తి 43 ఏళ్లలో ఏకంగా 53 మందిని వివాహం చేసుకున్నాడు. కొన్ని సార్లు ఏడాదికి.. 2,3 పెళ్లిల్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నావ‌ని అడిగితే మనశ్శాంతి, స్థిరత్వం కోసమ‌ని చెపుతున్నాడు. 53 పెళ్లిల్లు చేసుకున్న ఆ వ్యక్తి పేరు అబూ అబ్దుల్లా.. వయసు 63.. నివసించేది సౌదీ అరేబియాలో. అబ్దుల్లాకు తొలిసారి 20 వ ఏట వివాహం అయ్యింది. రెండేళ్ల బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి దంపతుల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. అలా.. అబ్దుల్లా తన 23వ ఏట మొదటి భార్యకు తలాక్‌ చెప్పి.. విడాకులు తీసుకుని.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే అది కూడా ఎక్కువ రోజుల నిలవలేదు. ఆ తర్వాత మూడో భార్యను వివాహం చేసుకున్నాడు. అలా 43 ఏళ్ల కాలంలో 53 మందిని వివాహం చేసుకున్నాడు. కానీ ఒక్క భార్య వల్ల కూడా తనకు మనశ్శాంతి లేదని తెలిపాడు అబ్దుల్లా. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. చాలా మంది భార్యలకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు ఇచ్చాడట.

వరుస పెట్టి ఇన్ని పెళ్లిల్లు చేసుకోవడంతో అబ్దుల్లాను ‘బహుభార్యా వేత్త’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాక అతడికి ఈ శతాబ్ధపు బహుభార్యావేత్త అని బిరుదు కూడా ఇచ్చారు. అయితే భార్యలు ఒకరితో ఒకరు గొడవపడడం అబ్దుల్లాకు చిరాకు కలిగిస్తుందట. వాళ్లు అలా గొడవ పడుతూ ఉంటే భరించలేక.. భార్యలకు తలాక్ చెప్పేశానని తెలిపాడు. ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘‘నన్ను సంతోషపెట్టి.. ఇంట్లో మనశ్శాంతి ఉండేలా చేసే భార్య కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇక ఒక పెళ్లి అయితే ఏకంగా ఒక్క రాత్రిలోనే ముగిసిపోయింది. పెళ్లైన మరుసటి రోజే ఆమెకు డైవర్స్‌ ఇచ్చాను. ఇక నేను వివాహం చేసుకున్న ఈ 53 మందిలో ఒక విదేశీ వనిత కూడా ఉంది. బిజినెస్‌ పనుల నిమిత్తం విదేశాలకు అక్కడ నా బాగోగులు చూసుకోవడానికి ఒక మహిళను వివాహం చేసుకున్నాను. 53 మందిని చేసుకున్నా ఒక్కరి వల్ల కూడా నాకు మనశ్శాంతి లేదు. ఇప్పటికైనా ఒక‌ మంచి భార్య దొరుకుతుందేమో అని చూస్తున్నానని అంటున్నాడు 63 ఏళ్ల అబ్దుల్లా.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu